Bad News to Allu Arjun Fans: అల్లు అర్జున్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. తెర మీదకు 25 లక్షల కష్టం..?

Bad News to Allu Arjun Fans: తమ హీరో పుట్టినరోజు సంధర్భంగా దేశముదురు సినిమాను మరలా వీక్షించాలని భావించిన అల్లు అర్జున్ అభిమానులకు షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 28, 2023, 04:41 PM IST
Bad News to Allu Arjun Fans: అల్లు అర్జున్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. తెర మీదకు 25 లక్షల కష్టం..?

DVV Danayya Demandind 25 lakhs to Release Desamuduru in 4K: ఈ మధ్యకాలంలో ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు అలాగే ఒకప్పుడు మంచి టాప్ తెచ్చుకున్న సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా ఎక్కువైంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సహా అనేక మంది హీరోలకు సంబంధించిన సినిమాలను మళ్లీ రీలీజ్ చేయడమే కాదు వాటిని అభిమానులు ఆదరిస్తున్న పరిస్థితి క్కూడా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన దేశముదురు సినిమా ఫోర్ కెలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ దీనిని పాత ఫార్మాట్ నుంచి మళ్లీ 4k లోకి మార్చింది. ఈ నేపద్యంలోనే డివివి దానయ్య ఇప్పుడు అలా మార్చడం కోసం పాతిక లక్షల రూపాయలు ఖర్చయ్యాయి కాబట్టి వాటిని వెనక్కి ఇవ్వాలని అలా చేస్తే దియేటర్లకు సినిమా వేసుకునేందుకు అవకాశం ఇస్తానని అల్లు అర్జున్ అభిమానులకు చెప్పుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతానికి రిలీజ్ చేస్తున్న సమయంలో వచ్చిన అమౌంట్ లు అభిమానులు కొన్ని ధార్మిక కార్యక్రమాలకు, చారిటీ కార్యక్రమాలకు వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి పాతిక లక్షలు స్వయంగా నిర్మాత ఇవ్వమని కోరడంతో అది ఎంతవరకు తమకు వర్కౌట్ అవుతుందనే విషయం మీద ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించిన అభిమానులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం చాలా తక్కువ షోస్ ఉంటాయి కాబట్టి పాతిక లక్షల మీద డబ్బు కలెక్ట్ చేసి మళ్లీ డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఇవ్వడం అనేది కాస్త ఇబ్బందికరమైన అంశమే అనే మాట వినిపిస్తోంది. మరి ఈ విషయంలో డీవీడీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత డివివి దానయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అభిమానుల కోరిక మేరకు పాతిక లక్షల రూపాయలను వదులుకొని సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారా? అనేది తెలియాల్సి ఉంది చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

Also Read: Akanksha Dubey Suicide: హోటల్ గదిలో ఉరేసుకున్న స్టార్ హీరోయిన్.. పవర్ స్టార్ పవన్ తో చివరి సాంగ్?

Also Read: Dasara Business: దుమ్మురేపిన నాని దసరా ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News