AR Rehman: నాపై కుట్ర చేస్తున్నారు

A.R. Rehman: ఎ.ఆర్. రెహమాన్... సంగీత ప్రపంచంలో రారాజు.. సంగీతమే తప్ప అనవసర వివాదాలు జోలికిపోని ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్. అలాంటి రెహ్మాన్ తాజాగా బాలీవుడ్‌లో ( Bollywood ) కొందరిపై వారి పేరు చెప్పకుండానే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jul 26, 2020, 01:40 AM IST
AR Rehman: నాపై కుట్ర చేస్తున్నారు

A.R. Rehman: ఎ.ఆర్. రెహమాన్... సంగీత ప్రపంచంలో రారాజు.. సంగీతమే తప్ప అనవసర వివాదాలు జోలికిపోని ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్. అలాంటి రెహ్మాన్ తాజాగా బాలీవుడ్‌లో ( Bollywood ) కొందరిపై వారి పేరు చెప్పకుండానే సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాలు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించగా.. అక్కడ తనని కొంతమంది అడ్డుకుంటున్నారని రెహ్మాన్ అన్నారు. ''ట్యూన్స్ కోసం తన వద్దకు వచ్చే వారిని కూడా రెహ్మాన్ వద్దకు వెళ్లొద్దు.. ట్యూన్స్ ఆలస్యంగా ఇస్తాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు'' అని ఆవేదన వ్యక్తంచేశాడు. Also read: Dil Bechara review: దిల్ బెచారా మూవీ రివ్యూ, రేటింగ్, హైలైట్స్

Sushant Singh Rajput  చివరి చిత్రమైన దిల్ బెచారా మూవీకి సూపర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన రెహ్మాన్ తాజాగా ఓ ఎఫ్ఎం రేడియో ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు. దిల్ బెచారా మూవీ డైరెక్టర్ ముకేష్ ఛాబ్రా కూడా మ్యూజిక్ కోసం తన వద్దకు వస్తుంటే.. రెహ్మాన్ వద్దకు వెళ్లొద్దని కొంతమంది సూచించారని.. ఆ విషయాన్ని ఛాబ్రానే స్వయంగా తనకు చెప్పాడని రెహ్మాన్ తెలిపారు. ఏదేమైనా ఛాబ్రాకు కేవలం రెండే రోజుల్లో నాలుగు పాటలకు ట్యూన్స్ ఇచ్చానని రెహ్మాన్ తెలిపాడు. Also read:  Kangana Ranaut on Sushant`s suicide: సుశాంత్‌ది సూసైడ్ కాదు.. పక్కా మర్డర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిసారిగా నటించిన Dil Bechara movie ఇటీవలే ఓటిటి ద్వారా ఆడియెన్స్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ చివరి సినిమాకు ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ముఖేష్ ఛాబ్రా డైరెక్ట్ చేయగా.. సుశాంత్ సరసన కొత్త హీరోయిన్ సంజనా సంఘీ ( Sanjana Sanghi ) జంటగా నటించింది. Also read: RGV: పరాన్న జీవి టీజర్‌పై వర్మ కౌంటర్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x