Poochandi First look out: ఫస్ట్ లుక్‌తోనే దెయ్యంలా భయపెట్టిన అంజలి

First look of Anjali and Yogi Babu Movie Poochandi out | హారర్ థ్రిల్లర్ మూవీతో అదరగొట్టేందుకు సిద్ధమైంది టాలీవుడ్ నటి. ఫాంటసీ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న తమిళ చిత్రం పూచండి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. శ్మశానంలో తిరుగుతున్న దెయ్యంలా నటి అంజలి నిజంగానే భయపెట్టేలా ఉంది. 

Last Updated : Nov 9, 2020, 07:10 PM IST
Poochandi First look out: ఫస్ట్ లుక్‌తోనే దెయ్యంలా భయపెట్టిన అంజలి

హారర్ థ్రిల్లర్ మూవీతో అదరగొట్టేందుకు సిద్ధమైంది టాలీవుడ్ నటి. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెంచుతోంది నటి అంజలి. కోలీవుడ్‌లో అంజలి (Actress Anjali) హారర్ మూవీ చేస్తోందని తెలిసిందే. ఫాంటసీ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న కోలీవుడ్ మూవీ పూచండి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ (First Look of Poochandi Movie) వచ్చేసింది. శ్మశానంలో తిరుగుతున్న దెయ్యంలా నటి అంజలి నిజంగానే భయపెట్టేలా ఉంది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్త తరహా పాత్రలో అంజలి కనిపించనుంది.

 

అంజలితో పాటు స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు. పూచండి ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. నల్ల రంగు దుస్తులు ధరించి నేను భయపెట్టేందుకు సిద్ధమనేలా కళ్లు పెద్దవి చేసి అంజలి కనిపిస్తుంటే.. ప్రపోజ్ చేసేందుకు వచ్చినట్లు యోగి బాగు రోజాతో ఆమె వెనుకాలే నిలుచ్చున్నాడు. పీఆర్వో బీఏ రాజు పూచండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇటీవల ఫేమస్ అయిన హారర్ కామెడీ మూవీ వస్తోందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. 

 

 

ఈ సినిమాలో అంజలి బాస్కెట్ బాల్ ప్లేయర్, కోచ్‌గానూ కనిపించనుంది. తమ సినిమా కథను వినగానే అంజలి ఓకే చెప్పారని, ఆమె పూచండి స్టోరీ అంతగా నచ్చిందని దర్శకుడు కృష్ణన్ జ‌య‌రాజ్‌ ఇటీవల అన్నారు. అంజలి, యోగిబాబు కాంబినేషన్ సీన్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News