Baby Movie: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' విజృంభణ.. 8 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..

Baby Movie Collections: తొలి రోజు ఓపెనింగ్స్ పెద్దగా లేవు. తీరా చూస్తే వారం తిరిగే సరికి రూ.50  కోట్ల క్లబ్ లో చేరిపోయింది బేబీ మూవీ. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని నిరూపించింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాకు యూత్ బ్రహ్మరథం పడుతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2023, 04:20 PM IST
Baby Movie: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' విజృంభణ.. 8 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..

Baby Movie Box Office Collections:  టాలీవుడ్ లో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలామే అయింది. బేబీతో ఆ కోరిక తీరిపోయింది. కల్ట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న బేబీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈ సినిమాకు వెళ్తున్నారంటే బేబీ (Baby Movie) ఎలాంటి ఇంఫాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ చిత్రం నార్మల్ డేస్, వీకెండ్ అని లేకుండా అన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొడుతోంది. 

రోజురోజుకు సినిమాకు క్రేజ్ పెరుగుతుండటంతోపాటు కలెక్షన్ల కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం 8 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ఈ మార్క్ ను అందుకోవడానికే పెద్ద సినిమాలు సైతం తెగ కష్టపడుతుంటే.. బేబీ మాత్రం ఈజీగా అందుకుంది. థియేటర్లలో అంతగా ఆకట్టుకునే సినిమాలు లేకపోవడంతో  సినీ లవర్స్‌కు బేబీ తప్ప మరో ఆప్షన్‌ కనిపించడం లేదు. వచ్చే వారం రిలీజయ్యే బ్రో వరకు ఈ సినిమాకు పోటీయే లేదు. 

Also Read: SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ లీడ్ రోల్ లో నటించారు. ముఖ్యంగా విజయ్‌ బుల్గానిన్‌ అందించిన సంగీతం సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టింది. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ ఈ మూవీని నిర్మించాడు. సుమారు రూ.10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోందని ఎవరూ ఊహించి ఉండరు. 

Also Read: Kanguva Movie: గెట్‌ రెడీ.. సూర్య 'కంగువా' గ్లింప్స్‌ వచ్చేస్తోంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News