Akhanda Movie Collection: 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ.. రూ.200 కోట్ల కలెక్షన్స్

Akhanda Movie Collection: బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రిలీజై నేటితో (జనవరి 20) 50 రోజులు పూర్తి చేసుకుంది. సరిగ్గా ఇదే రోజు రూ.200 కోట్ల కలెక్షన్ మార్క్​ను అందుకుందీ చిత్రం. ఈ విషయాన్ని చెబుతూ చిత్రబృందం పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 11:22 AM IST
    • 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ మూవీ
    • 103 కేంద్రాల్లో ఈ ఘనత సాధించిన చిత్రంగా ఘనత
    • రూ.200 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరిన బాలయ్య మూవీ
Akhanda Movie Collection: 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ.. రూ.200 కోట్ల కలెక్షన్స్

Akhanda Movie Collection: హీరో బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి కాంబోలో విడుదలైన సినిమా 'అఖండ' విజయాన్ని అందుకుని కరోనా కోరల్లో చిక్కుకున్న చిత్రసీమకు మళ్లీ ఊపరిపోసింది. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్లు కొలగొడ్డుతూ రికార్డులు సృష్టించింది. బాలయ్య కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. బాలయ్య నటనకు, యాక్షన్​కు అభిమానులు ఫిదా అయిపోయారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లాయి. 

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అక్కడి ప్రేక్షకులు కూడా అఖండకు బ్రహ్మరథం పట్టారు. మాస్ ఆడియెన్స్​ను విపరీతంగా అలరించిన ఈ మూవీ.. నేటితో (జనవరి 20) అత్యంత విజయవంతంగా 50వ రోజులోకి అడుగుపెట్టింది. దీంతో పలుచోట్ల ఫ్యాన్స్​ భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. 

రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

కరోనా రెండో దశ ప్రభావం, టిక్కెట్ రేట్ల వివాదం, షోల తగ్గింపు ఇలా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొని విజయవంతంగా 50వ రోజులోకి అడుగుపెట్టింది. 103 కేంద్రాల్లో ఈ మార్క్​ను అందుకుంది. ప్రస్తుతం ఈ ఘనత సాధించడమనేది గొప్ప విషయమనే చెప్పాలి.

బాలయ్య విశ్వరూపం, బోయపాటి మాస్ డైరెక్షన్, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్.. సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. బంపర్​ హిట్​ అందించాయి. దీంతో 50వ రోజులో అడుగుపెట్టే సమయానికి థియేటర్లలో గ్రాస్-నాన్ థియేట్రికల్​ హక్కులు మొత్తం కలిపి రూ.200 కోట్లు వసూలు చేసింది. బాలయ్య కెరీర్​లో ఈ మార్క్​ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. ఇది బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన మూడో చిత్రం. గతేడాది డిసెంబరు 2న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.  

Also Read: Daksha Nagarkar Photos: దక్షా నగార్కర్ అందాలు.. బంగార్రాజు భామ క్రేజ్ మామూలుగా లేదుగా!

Also Read: Pooja Hegde Bikini Photo: మాల్దీవుల్లో బుట్టబొమ్మ అందాల ఆరబోత.. బికినీలో వయ్యారాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News