Gas Blast Uttarakhand: డెహ్రాడూన్‌లో ఘోర విషాదం.. నలుగురు బాలికలు సజీవ దహనం

Dehradun Gas Cylinder Blast: ఓ మహిళ గ్యాస్ సిలిండర్ మారుస్తున్న సమయంలో చేసిన పొరబాటు కారణంగా నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 11:04 AM IST
Gas Blast Uttarakhand: డెహ్రాడూన్‌లో ఘోర విషాదం.. నలుగురు బాలికలు సజీవ దహనం

Gas Cylinder Blast in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగి నలుగురు బాలికలు సజీవ దహనమయ్యారు. మృతులు రెండున్నర నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు మధ్య వారే. నాలుగు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దాదాపు 5 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయింది. డెహ్రాడూన్‌లోని వికాస్‌నగర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘోర దుర్ఘటన జరిగింది.  చక్రతా డిప్యూటీ కలెక్టర్ యుక్తా మిశ్రా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థిని సమీక్షించారు. పూర్తి వివరాలు ఇలా..

తుని నది వంతెన సమీపంలో నివసిస్తున్న సూరత్ రామ్ జోషి అనే వ్యక్తి విద్యాశాఖలో రిటైర్డ్ ఉద్యోగి. చెక్కతో చేసిన నాలుగు అంతస్తుల భవనంలో ఆయన కుంటుంబంతోపాటు ఐదు కుటుంబాలు అద్దెకు జీవిస్తున్నాయి. అందులో అద్దెకు ఉంటున్న విక్కీ అనే వ్యక్తి భార్య కుసుమ్ గురువారం వంట గదిలో ఎల్పీసీ సిలిండర్లు మారుస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆమె మంటలు ఆర్పిందుకు ప్రయత్నించగా.. మంటలు ఒక్కసారి ఇంటిని చుట్టుముట్టాయి. కుసుమతోపాటు నలుగురు మంటల్లో బయటకు రాలేక నలుగురు బాలికలు చిక్కుకున్నారు. ఒక వ్యక్తి, ఒక బాలుడు మంటల్లో నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు.  

ఇంట్లోని నాలుగు సిలిండర్లు ఒకదాని తరువాత ఒకటి పేలిపోలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి 150 మీటర్ల దూరంలో ఉన్న ఫైర్ ఇంజిన్.. ఇరవై నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకుంది. వెంటనే మంటలను ఆర్పించేందుకు యత్నించగా.. వాహనంలో నీరు తక్కువగా ఉండడంతో మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక దళం నీరు నింపుకుని తిరిగి వచ్చేసరికి మంటల్లో ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. ఉత్తరకాశీ డీఎం మోరీ నుంచి, హిమాచల్ ప్రదేశ్‌లోని జుబల్ నుంచి కూడా ఫైర్ ఇంజిన్లను పిలిపించారు. 

Also Read: Gas Price: గుడ్‌న్యూస్.. గ్యాస్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. కుసుమ తీవ్ర గాయాలతో బయటపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుంజన్ (10), రిద్ధి (10), మిష్టి (6), సెజల్ (3) చిన్నారులు మృతి చెందినట్లు గుర్తించారు. సాయంత్రం 4:25 గంటలకు మంటలు చెలరేగాయని.. అగ్నిమాపక వాహనం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ డెహ్రాడూన్ రాజేంద్ర ఖతీ తెలిపారు. వాహనం కెపాసిటీ 2200 లీటర్లు కావడంతో నీరు తక్కువ వచ్చిందని.. మోరీ నుంచి కూడా మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్ తెప్పించినట్లు వెల్లడించారు. 

Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News