Daughter Killed: ఇంట్లో బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా కుమార్తె.. ఇది చూసిన తల్లి

Love Murder Dandumailaram: ఒక్కగానొక్క కూతురు.. అల్లారుముద్దుగా పెంచారు. కానీ ప్రేమ అనే పదంతో ఆ కూతురి మీద కుటుంబసభ్యులు పగబట్టారు. ప్రేమ వ్యవహారంలో కుమార్తెను దారుణంగా హత్య చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2024, 03:22 PM IST
Daughter Killed: ఇంట్లో బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా కుమార్తె.. ఇది చూసిన తల్లి

Dandumailaram Murder: ప్రేమ వ్యవహారం సొంత కూతురినే మట్టుబెట్టే స్థాయికి చేరుకుంది. ముగ్గురు సంతానంలో ఉన్న ఏకైక కుమార్తె కావడంతో అల్లారుముద్దుగా పెంచిన బిడ్డనే కర్కశంగా చంపేశారు. యువతిని హత్య చేసింది కుటుంబసభ్యులే అని స్పష్టమవుతున్నా ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. ఆత్మహత్యగా కుటుంబీకులు చెబుతున్నా.. ఇంట్లో జరిగిన పరిస్థితి మాత్రం చాలా అనుమానాలకు తావిస్తోంది. గ్రామస్తులు కుటుంబసభ్యులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పరువు హత్యగా భావిస్తున్న ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Tragedy: షాకింగ్‌ ఘటన.. స్నేహితుడి పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు 

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన మోతే జంగమ్మ, ఐలయ్యకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె భార్గవి (19). హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతుండేది. కుమార్తెకు పెళ్లి చేయాలని ఇటీవల కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో బంధువైన ఓ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి భార్గవి గ్రామంలోని ఇంట్లో కిటికీకి శవంగా తేలింది. కిటికీకి వేసుకున్నట్లు అక్కడ ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వచ్చి చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తీసి పోస్టుమార్టమ్‌ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. 

Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌

 

అయితే ఇంట్లో పరిస్థితులు ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించడం లేదు. దీనికితోడు భార్గవి దేహంపై గాయాలు కనిపిస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే గ్రామస్తుల మాత్రం ఇది ఆత్మహత్య కాదు కుటుంబసభ్యులే అమ్మాయిని చంపేశారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ పరువు హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జరిగిన వాస్తవం ఇది అని ఓ కథ చెప్పారు.

గ్రామస్తుల కథనం
గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శశి అనే అబ్బాయిని భార్గవి ప్రేమించింది. ఈ విషయం ఇటీవల యువతి ఇంట్లో తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు భార్గవిని కళాశాలకు పంపించకుండా రెండు వారాలుగా ఇంట్లోనే ఉంచారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో భార్గవి కోసం శశి వచ్చాడు. వారిద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో తల్లి జంగమ్మ వచ్చింది. కూతురితో అతడిని చూసి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్రంగా మందలించి దాడికి పాల్పడింది. ఆ వెంటనే కిటికీకి చున్నీతో కూతురిని చంపేసింది. ఆమె కుమారుడు చరణ్‌ కూడా తల్లికి సహకరించాడు. అనంతరం కూతురు ఆత్మహత్య చేసుకుందని ఏడవడం ప్రారంభించారు. ఇది గ్రామస్తులు చెబుతున్న కథనం.

వాస్తవేమిటనేది త్వరలోనే పోలీసులు చెప్పనున్నారు. శశి అనే యువకుడితో ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అయితే ఎవరూ హత్య చేశారనేది ఆసక్తికరంగా మారింది. తల్లినా.. లేదా కుటుంబసభ్యులందరూ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారా అనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నిజనిజాలు పోలీసులు వెలుగులోకి తీసుకురానున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News