Chhattisgarh Crime: నల్లగా ఉన్నావన్నందుకు.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..

Chhattisgarh Crime: రూపం కంటే గుణమే ముఖ్యమన్నారు పెద్దలు. అనుభవపూర్వకంగానే చెప్పారని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన చూస్తే తెలుస్తోంది. నల్లగా ఉన్నావంటూ రోజూ టార్చర్ చేస్తున్న భర్తను నరికి చంపింది ఓ భార్య.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2022, 08:07 AM IST
  • ఛత్తీస్‌గఢ్‌ లో దారుణం
  • అందంగా లేవని, నల్లగా ఉన్నావని అన్నందుకు
  • భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
Chhattisgarh Crime: నల్లగా ఉన్నావన్నందుకు.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..

Chhattisgarh Crime: అందంగా లేవని, నల్లగా ఉన్నావంటూ రోజూ భార్యను వేధించేవాడు ఓ భర్త. అతడి ఆగడాలను కొంతకాలంపాటు భరించింది భార్య. నానాటికీ భర్త టార్చర్ ఎక్కువ అవుతుండటంతో సహించలేక గొడ్డలితో భర్తను నరికి చంపింది. అనంతరం అతడి మర్మాంగాన్నీ సైతం కోసేసింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో జరిగింది. 

అసలేం జరిగిందంటే...
పోలీసుల కథనం ప్రకారం, అమలేశ్వర్‌ గ్రామంలో అనంత్‌ (40), సంగీత దంపతులు నివాసముంటున్నారు. అనంత్ తొలి భార్య చనిపోవడంతో సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రోజూ అతడు భార్యను నల్లగా ఉన్నావంటూ, అందంగా లేవంటూ అసభ్య పదజాలంతో దూషించేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయమై భార్యభర్తలు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రక్తురాలైన భార్య ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా ఆమె మర్మాంగాన్ని కూడా తొలిగించినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత తన భర్తను ఎవరో చంపారంటూ స్థానికులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసుల.. చివరకి భార్యే  చంపిందన్న నిజాన్ని రాబట్టారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేశారు. 

Also Read: Uttar Pradesh: అదుపుతప్పి చెరువులో ట్రాక్టర్ బోల్తా... 10 మంది మృతి, పలువురికి గాయాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News