What is credit score: క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి ? లోన్ అప్రూవ్ కావాలంటే ఎంత స్కోర్ ఉండాలి ?

What is credit score, Interesting Facts About Credit Score: ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ గురించి చాలామందికి ఒక రకంగా అవగాహన ఏర్పడినప్పటికీ... కొంతమందిలో మాత్రం క్రెడిట్ స్కోర్ గురించి ఇప్పటికీ సరైన అవగాహన లేక ఏదైనా రుణం కోసం బ్యాంకులకు వెళ్లి క్రెడిట్ స్కోర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు.

Written by - Pavan | Last Updated : Sep 27, 2023, 09:53 PM IST
What is credit score: క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి ? లోన్ అప్రూవ్ కావాలంటే ఎంత స్కోర్ ఉండాలి ?

What is credit score, Interesting Facts About Credit Score: ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ గురించి చాలామందికి ఒక రకంగా అవగాహన ఏర్పడినప్పటికీ... కొంతమందిలో మాత్రం క్రెడిట్ స్కోర్ గురించి ఇప్పటికీ సరైన అవగాహన లేక ఏదైనా రుణం కోసం బ్యాంకులకు వెళ్లి క్రెడిట్ స్కోర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. క్రెడిట్ స్కోర్ గురించి తెలిసిన వారికి ఇది పెద్ద సమస్యగా అనిపించకపోయినా... క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో పూర్తిగా తెలియని వారికి లేదా తమ జీవితంలో మొదటిసారిగా అప్పు కోసం బ్యాంకుల వద్దకు వెళ్లే వారికి మాత్రం క్రెడిట్ స్కోర్ గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి ? గుడ్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి ? బ్యాడ్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి ? ఇలా రకరకాల ప్రశ్నలు వారి మెదడును తొలిచేస్తుంటాయి. 

క్రెడిట్ స్కోర్ కానీ లేదా సిబిల్ స్కోర్ కానీ అంటే ఏంటో మీకు తెలుసా ?  ఎవరైనా ఒక వ్యక్తి పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసినా లేదా హోమ్ లోన్, బిజినెస్ లోన్, వెహికిల్ లోన్... ఇలా ఏ రకం లోన్ కోసం అప్లై చేసినా.. లేదంటే క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసినా.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటి ? మీరు తీసుకునే రుణం తిరిగి చెల్లించగలరా లేదా ? లేదంటే గతంలో తీసుకున్న లోన్స్ సకాలంలో చెల్లించారా లేక ఏవైనా ఎగవేయడం జరిగిందా అనే అంశాలను బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. అందుకోసం బ్యాంకులు ఉపయోగించే ఆయుధమే ఈ క్రెడిట్ స్కోర్. 

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు దరఖాస్తు చేసిన రుణం మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీరు అప్లై చేసిన లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులే కాదు.. నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు కూడా మీకు రుణం మంజూరు చేయాలా వద్దా అనడానికి మీ క్రెడిట్ స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇంత ముఖ్యమైన క్రెడిట్ స్కోర్ గురించి అవగాహన లేకపోతే లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకుల నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి.. బ్యాడ్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి ?
సాధారణంగా ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది. ఇందులో ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఆర్థికంగా మీ ప్రొఫైల్ సేఫ్ ప్రొఫైల్ అని బ్యాంకులు భావిస్తాయి. కనీసం 750 క్రెడిట్ స్కోర్ ఉంటేనే అది గుడ్ స్కోర్ అని పరిగణిస్తారు. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అది తిరుగు లేని మెరుగైన స్కోర్ అవుతుంది. అలాంటి స్కోర్ ఉంటే మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయకుండా బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. 

ఒకవేళ 720 లేదా 750 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉందంటే.. అది ఆర్థికంగా మీరు బలహీనంగా ఉన్నారని సూచిస్తుంది. అంతేకాకుండా మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో కానీ లేదా స్థోమతకు మించి క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు అని కానీ సూచిస్తుంది. అందుకే ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అంత మంచిది... అలాగే ఎంత తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అంత ఎక్కువ రిస్క్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ రుణం మంజూరు చేసేందుకు ముందుకు వస్తాయి, కాకపోతే వడ్డీ రేటు విషయంలో వాటికి ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Trending News