Vande Bharat Sleeper Ticket: వందేభారత్ , వందేభారత్ స్లీపర్, మెట్రో రైళ్ల టికెట్ ఎంత

Vande Bharat Sleeper Ticket: ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన వందేభారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఒకటి రెండు మార్గాలు తప్పించి దాదాపు అన్ని మార్గాల్లో ఈ రైళ్లు బిజీగా ఉంటున్నాయి. వందేభారత్ రైళ్లలో మూడు రకాలున్నాయి. ఆ టికెట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2024, 07:55 PM IST
Vande Bharat Sleeper Ticket: వందేభారత్ , వందేభారత్ స్లీపర్, మెట్రో రైళ్ల టికెట్ ఎంత

Vande Bharat Sleeper Ticket: దేశంలో ప్రతి రోజూ లక్షలాది ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. వందేభారత్ రైలు రాకముందు దేశంలో ఫాస్టెస్ట్ రైలు శతాబ్ది కాగా ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 2019లో ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పుడు దాదాపు దేశంలోని అన్ని నగరాల్ని కనెక్ట్ చేస్తున్నాయి. 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మూడు రకాలున్నాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్, వందేభారత్ మెట్రో, వందేభారత్ స్లీపర్ రైళ్లు. వందేభారత్ మెట్రో ఇటీవలే ప్రారంభమైంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికే వివిధ నగరాలను, రాష్ట్రాలను కలుపుతూ రాకపోకలు సాగిస్తున్నాయి. సమయం ఆదా అవుతుండటంతో ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దేశవ్యాప్తంగా 100కు పైగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతానికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛైర్‌కార్‌గానే ఉంది. త్వరలో స్లీపర్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛైర్‌కార్ దేశంలోని వివిధ మార్గాల్లో ప్రయాణం చేస్తోంది. ఇందులో టికెట్ ఎంత ఉందనేది ప్రయాణించే మార్గం, కోచ్‌ను బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు కోటా నుంచి ఆగ్రాకు వందేభారత్ ఛైర్‌కార్ ధర 830 రూపాయలు కాగా, ఎగ్జిక్యూటివ్ టికెట్ అయితే 1635 రూపాయలుంది. అదే కోటా నుంచి ఉదయ్‌పూర్‌కు 745 సాధారణ టికెట్ కాగా ఎగ్జిక్యూటివ్ టికెట్ 1465 రూపాయలుగా ఉంది.

వందేభారత్ మెట్రో టికెట్

రెండ్రోజుల క్రితం వందేభారత్ మెట్రో ప్రారంభమైంది. గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు మొదటి రైలు ప్రారంభమైంది. ఇందులో మినిమం టికెట్ 30 రూపాయలుంది. సీజన్ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

వందేభారత్ స్లీపర్ టికెట్

వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇది పూర్తిగా ఏసీ ట్రైన్. ఇందులో కూడా త్రీ టైర్, టూ టైర్, ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటాయి. ధర్డ్ ఏసీ టికెట్ 1500 నుంచి 2000 ఉంటుంది. సెకండ్ ఏసీ టికెట్ 2000 నుంచి 2500 ఉంటుంది. ఇక ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ అయితే 3000 నుంచి 3500 ఉంటుంది. 

Also read: 8 Seater Cars: 8 సీటర్ కారు కోసం చూస్తున్నారా మీ కోసం టాప్ 5 బెస్ట్ 8 సీటర్ కార్లు ఇవే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News