Electricity bill: వేసవిలో కరెంటు బిల్లు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

How to reduce electricity bill:  చలి కాలంతో పోలిస్తే వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది. అయితే కరెంట్ బిల్లును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.    

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 12:57 PM IST
  • చాలా మంది ఒకేసారి అనేక సాధనాలను ఉపయోగిస్తారు
  • దీంతో ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయి
  • కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
Electricity bill: వేసవిలో కరెంటు బిల్లు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

How to reduce electricity bill:  చలికాలం ముగుస్తోంది. త్వరలో ఎండాకాలం రాబోతుంది. వేడిని తట్టుకోవడానికి ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు విపరీతంగా వాడుతాం. దీంతో కరెంటు బిల్లు తడిసి మోపుడవుతోంది.  కొన్ని పరికరాలను వాడటం వల్ల కరెంట్ బిల్లు (electricity bill) తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని చిట్కాలు పాటించటం వల్ల విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు.

24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ACని ఉంచండి:
ఎండలు మండుతున్నప్పుడు, ఉక్కబోత ఎక్కువగా ఉన్నప్పుడు గదిని త్వరగా చల్లబరచడానికి ప్రజలు ఏసీ ఉష్ణోగ్రతను 18 నుండి 19కి మారుస్తారు. ఇది అధిక విద్యుత్ వినియోగానికి దారి తీస్తుంది. దాంతో కరెంట్ బిల్లు పెరుగుతోంది. అలా కాకుండా ఏసీ (AC) ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచినట్లుయితే..మీ గది చల్లగా ఉంటుంది, విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. మీరు ఏసీలో టైమర్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.ఇది గది చల్లగా ఉన్నప్పుడు ఏసీని స్వయంచాలకంగా ఆఫ్ చేస్తుంది.

పవర్ స్ట్రిప్ ఉపయోగించండి:
పెద్ద పెద్ద ఇళ్లల్లో బహుళ గాడ్జెట్‌లు ఒకేసారి ఉపయోగించబడతాయి. అలాంటప్పుడు పవర్ స్ట్రిప్‌ని ఉపయోగించండి. ఇది వినియోగించటం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. 

LED బల్బును వాడండి:
ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో పాత ఫిలమెంట్ బల్బులు, సీఎఫ్‌ఎల్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పాత పరికరాలు ఎక్కువ విద్యుత్ ను ఉపయోగిస్తాయి. వీటికి బదులు ఇంట్లో ఎల్ఈడీ (LED) బల్బులను ఉపయోగించండి. ఇది మీ విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది. 100 వాట్ ఫిలమెంట్ బల్బ్ 10 గంటల్లో 1 యూనిట్ బిల్లును ఉపయోగిస్తుంది. అదే సమయంలో, 15 వాట్ల సీఎఫ్ఎల్ (CFL) 66.5 గంటల్లో 1 యూనిట్ విద్యుత్‌ను వినియోగిస్తుంది. అదే సమయంలో, 9-వాట్ల LED బల్బు 111 గంటల్లో ఒక యూనిట్ విద్యుత్ బిల్లును వినియోగిస్తుంది.

ఇవీ గుర్తుంచుకోండి:
మీరు ఫ్రిజ్, ఏసీ వంటి పరికరాలను కొనుగోలు చేసేటప్పుడు, రేటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. 5 స్టార్ రేటింగ్ ఉన్న సాధనాలు తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గడమే దీనికి కారణం.

స్మార్ట్ పరికరాన్ని ఉపయోగించడం:
ప్రస్తుతం స్మార్ట్‌ పరికరాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్ పరికరాలు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. ఈ స్మార్ట్ పరికరాలలో స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ బల్బులు, స్మార్ట్ ఏసీలు మొదలైనవి ఉన్నాయి. అవి విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. దీంతో కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది.

Also Read: Samsung Galaxy Z Flip: రూ.96,000 విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ.36 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News