UPI Automatic Payment Limit Increased: యూపీఐ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. యూపీఐ ద్వారా రూ.లక్ష వరకు ఆటో చెల్లింపు చేయవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు ఈ లిమిట్ రూ.15 వేలు మాత్రమే ఉండగా.. తాజాగా లిమిట్‌ను పెంచింది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుతో సహా అనేక సేవలలో ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. కేటగిరీలలో యూపీఐ ఆటో పే పరిమితిని ఒక్కో లావాదేవీకి లక్ష రూపాయలకు పెంచినట్లు తెలిపింది.
ఇప్పుడు కస్టమర్లు మొబైల్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఈఎంఐ చెల్లింపు, వినోదం/ఓటీటీ సబ్స్క్రిప్షన్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ వంటి చెల్లింపులను సులభంగా చేయవచ్చు. ఏదైనా యూపీఐ అప్లికేషన్ని ఉపయోగించి రిపీట్ ఈ-ఆర్డర్‌ను ప్రారంభించాలి. ఈ మేరకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటివరకు రూ.15 వేల కంటే ఎక్కువ ఆటో చెల్లింపు లావాదేవీలకు ఓటీపీ అవసరం ఉండేది. ఇప్పుడు మీరు ఎటువంటి ఓటీపీ లేకుండానే రూ.లక్ష వరకు ఆటో చెల్లింపును సులభంగా కంప్లీట్ చేయవచ్చు.
గత వారంలో జరిగిన ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో యూపీఐ ద్వారా చెల్లింపు పరిమితిని రూ.లక్ష నుంచి 5 లక్షలకు పెంచారు. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 11.23 బిలియన్లకు చేరుకుంది. మీరు ఒకే యాప్ నుంచి మీకు సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయవచ్చు. మీరు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి.. తక్షణమే ఏదైనా చెల్లింపు చేయవచ్చు లేదా ఎవరి నంబర్‌కైనా డబ్బు పంపవచ్చు.
మీరు ఏదైనా యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నప్పుడు.. ఆటోమేటిక్ పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తే గడువు ముగిసిన తరువాత డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఆటో పే మోడ్ సెట్ చేసుకుంటే గడువు తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట సమయ విరామం తర్వాత చెల్లింపులు చేయడానికి ఇది మంచి ఎంపిక అని చెప్పొచ్చు. మీరు సకాలంలో చెల్లించకపోతే ఆలస్య రుసుము లేదా పెనాల్టీలను చెల్లించాల్సి రావచ్చు. ఆటో పే ద్వారా వాయిదాల చెల్లింపు చాలా సులభం అవుతుంది.
Also Read: World in 2023: ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని ఘటనలు, ప్రమాదాలు, పరిణామాలకు సాక్ష్యం 2023
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి