Best 8 Seater Car: ఎస్‌యూవీ ఎందుకు, అదే ధరకు 8 సీటర్ వచ్చేస్తోంది కదా

Best 8 Seater Car: దేశంలో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఎస్‌యూవీ వాహనాలకు ఎంపీవీ కార్లు పోటీ పడుతున్నాయి. ఎస్‌యూవీతో పోలిస్తే ఎంపీవీ బెస్ట్ ఆప్షన్ కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2024, 06:08 PM IST
Best 8 Seater Car: ఎస్‌యూవీ ఎందుకు, అదే ధరకు 8 సీటర్ వచ్చేస్తోంది కదా

Best 8 Seater Car: భారతీయ కారు మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. దూర ప్రయాణాల్లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే ఇతర సెడాన్ కార్ల అమ్మకాలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఎంపీవీ కార్లు మాత్రం వీటికి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఎందుకంటే ఎస్‌యూవీ కార్లకు ఉండే సౌకర్యాలకు తోడు అదనంగా సీటింగ్ ఉంటుంది. 7-8 సీటర్లు ఉండటంతో పాటు లాంగ్ డ్రైవింగ్ కంఫర్ట్ బాగుంటుంది. చాలామంది 7 సీటర్ కార్ల కోసం చూస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా 8 సీటర్ కార్లు మార్కెట్‌లో వచ్చేశాయి. వీటి ధర 14 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. ఈ 8 సీటర్ కార్లలో మహీంద్రా నుంచి టొయోటా వరకూ ఉన్నాయి. 

మారుతి ఇన్విక్టో. మారుతి సుజుకి నుంచి కొత్తగా లాంచ్ అయిన కారు ఇది. ఇందులో 7 సీటర్, 8 సీటర్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇది కాస్త హై ఎండ్ కారు. ఇందులో 8 సీటర్ ఆప్షన్ కారు ధర 25.35 లక్షలు ఎక్స్ షోరూంగా ఉంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 173 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. ఇందులో మేన్యువల్, ఆటోమేటిక్ రెండూ ఉన్నాయి. 

మహీంద్రా మరాజో. మహీంద్రా కంపెనీకు చెందిన ఈ 8 సీటర్ కారు చాలా చౌకైంది. 8 సీటర్ కార్ల జాబితాలో అత్యంత తక్కువ ధర ఇదే. ఇందులో ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి. ఈ కారు ధర 14.40 లక్షలు ఎక్స్ షోరూంగా ఉంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ అమర్చారు. 

టొయోటా ఇన్నోవా క్రిస్టా. టొయోటా ఇన్నోవా ఏళ్ల తరబడి మన్నిక పొందిన ఎంపీవీ కారు. ఇందులో కూడా 7 సీటర్, 8 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి.  ఇందులో 8 సీటర్ ఆప్షన్ కారు ధర 19.99 లక్షల రూపాయలుగా ఉంది. ఇందులో 2.4 లీటర్ డీజిల్ ఉంది. 

టొయోటా ఇన్నోవా హైక్రాస్. టొయోటా నుంచి అత్యధికంగా విక్రయమౌతున్న రెండవ ఎంపీవీ కారు ఇది. ఇందులో కూడా 7 సీటర్, 8 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 8 సీటర్ కారు ధర 19.82 లక్షలుగా ఉంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 173 పీఎస్ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా మేన్యువల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్లు ఉన్నాయి.

Also read: Best Selling Maruti Cars: దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న టాప్ 10 కార్లలో 7 మారుతి కంపెనీవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News