SBI Jobs Recruitment 2024: ఎస్బీఐలో ఆఫీసర్ ఉద్యోగాలు, 65 వేల జీతం, ఎలా అప్లై చేయాలంటే

SBI Jobs Recruitment 2024: దేశంలో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగానికి అర్హత, ఎలా అప్లై చేయాలనే వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2024, 04:14 PM IST
SBI Jobs Recruitment 2024: ఎస్బీఐలో ఆఫీసర్ ఉద్యోగాలు, 65 వేల జీతం, ఎలా అప్లై చేయాలంటే

SBI Jobs Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం కోసం మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు మార్చ్ 4వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

నిరుద్యోగులకు శుభవార్త, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 131 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చ్ 4 వరకూ దరఖాస్తులు పంపించేందుకు గడువుంది. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in.సందర్శిస్తే అప్లికేషన్ ఎలా దాఖలు చేయాలి, అర్హతలేంటి వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంది. 

మొత్తం 131 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల్లో సెక్యురిటీ ఎనలిస్ట్ డిప్యూటీ మేనేజర్ పోస్టులు 51 ఉన్నాయి. ఇక క్రెడిట్ ఎనలిస్ట్ మేనేజర్ పోస్టులు 50 ఉన్నాయి. సెక్యూరిటీ ఎనలిస్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 23, సెక్యూరిటీ ఎనలిస్ట్ మేనేజర్ పోస్టులు 3 ఉన్నాయి. అప్లికేషన్ సెక్యూరిటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు 3, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులు 1 ఉన్నాయి.

SBI SCO Recruitment 2024 online form direct link

ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in.ఓపెన్ చేయాలి. ఇందులో కెరీర్ లింక్ క్లిక్ చేయాలి. అక్కడ్నించి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ లింక్  క్లిక్ చేసి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. చివరిగా నిర్ణీత ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అప్లికేషన్‌తో పాటే నిర్ణీత పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించకపోతే ఆ దరఖాస్తు స్వీకరించబడదు. ఈ ఉద్యోగాల జీతం 63,840 రూపాయలతో ప్రారంభం కానుంది.

Also read: UPI Payment: మన దేశపు యూపీఐ ఏయే దేశాల్లో పనిచేస్తుందో తెలుసా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News