Sbi Amrit Vrishti : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తరచూ తన కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల డిపాజిట్ స్కీం లను ప్రవేశపెడుతోంది. వీటి ద్వారా కస్టమర్లకు తమ సేవింగ్స్ ను ప్రోత్సహించేందుకు అధిక శాతం వడ్డీ రేట్లు సైతం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సరికొత్త టర్మ్ డిపాజిట్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. దీని పేరు అమృత్ వృష్టి (Amrit Vrishti) ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం అత్యధిక వడ్డీరేట్లను కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. అయితే ఈ స్కీంలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే, ఇది దేశీయ కస్టమర్లతో పాటు ఎన్ఆర్ఐ కస్టమర్లు కూడా ఇందులో భాగస్వామ్యం కావచ్చు. కాగా జూలై 15వ తేదీ నుంచి ఈ నూతన స్కీం ప్రారంభమైనట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.
అమృత్ వృష్టి స్కీం ప్రత్యేకతలు ఇవే:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న, ఈ అమృత్ వృష్టి స్కీములో 7.25% వడ్డీని అందిస్తున్నారు. అయితే డిపాజిట్ కాలవ్యవధి 444 రోజులు ఉంటుంది. ఈ స్కీం లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, సీనియర్ సిటిజనులకు 0.5 శాతం అదనపు వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు ఈ డిపాజిట్ పై బ్యాంకు నుంచి లోన్ కూడా పొందవచ్చు. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు మీరు మీ సమీపంలో ఉన్న SBI బ్యాంకు బ్రాంచీలను సంప్రదించాలి. అలాగే Yono యాప్ ద్వారా కూడా ఈ స్కీంలో చేరవచ్చు. SBI అమృత్ వృష్టి స్కీం జూలై 15, 2024 నుండి మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
Also Read: Puri Ratna Bhandar: మళ్లీ తెరుచుకున్న పూరీ రత్న భండార్.. వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ఇవే..
డిపాజిట్ వ్యవధి: 444 రోజులు
అమృత్ వృష్టి స్కీం నిబంధనలు:
-ఈ స్కీం కింద, NRIలతో సహా రూ. 3 కోట్ల వరకూ ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు.
- ఈ స్కీంలో నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సర వ్యవధిలో వడ్డీ చెల్లిస్తారు.
- వడ్డీపై టీడీఎస్ వసూలు చేస్తారు. తర్వాత ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో దీన్ని మీరు పొందవచ్చు.
ముందస్తు విత్ డ్రాయల్ నియమాలు ఇవే:
రూ. 5 లక్షల వరకూ ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ముందస్తు విత్ డ్రాయల్ పై జరిమానా 0.50% విధిస్తారు. రూ. 5 లక్షల కంటే ఎక్కువ కానీ రూ. 3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై 1 శాతం జరిమానా విధిస్తారు.
ఎవరికి లాభం?
దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్ఐ రూపాయి టర్మ్ డిపాజిట్లపై ఈ పథకం అందుబాటులో ఉంది. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంక్ ఇంతకుముందు కూడా 'అమృత్ కలాష్' పేరుతో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 400 రోజుల డిపాజిట్లపై 7.60 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేసింది.
5 లక్షల పెట్టుబడిపై ఎంత రాబడి వస్తుంది?
రూ. 5 లక్షల పెట్టుబడిపై, మీరు 444 రోజుల తర్వాత సుమారు రూ. 5,46,842 మొత్తం అందుకుంటారు.
Also Read: Crows: చికెన్ షాపు మీద యుద్ధం ప్రకటించిన కాకులు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి