Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ

Small Savings Schemes Interest Rates: కమెర్షియల్ బ్యాంకులు వివిధ డిపాజిట్, సేవింగ్స్ స్కీమ్స్ పై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే ప్రభుత్వం నిర్వహించే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై అందిస్తున్న వడ్డీ రేట్లే ఎక్కువగా ఉన్నాయని తమ ప్రకటనలో పేర్కొన్న కేంద్రం.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించి నిర్ణయం తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంచేశారు.

Written by - Pavan | Last Updated : Feb 16, 2023, 04:47 AM IST
Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ

Small Savings Schemes Interest Rates: ప్రస్తుతం బ్యాంకులు వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు కంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రేట్లే చాలా మెరుగ్గా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వడ్డీ రేట్లను పెంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సమాధానం చెప్పాల్సిందిగా కోరుతూ ఫిబ్రవరి 13న పార్లమంట్ సమావేశాల్లో విపక్షాలు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది.

చిన్న మొత్తాల పొదుపు పథకాల విషయానికొస్తే.. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్రతో పాటు వివిధ రకాల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.

కమెర్షియల్ బ్యాంకులు వివిధ డిపాజిట్, సేవింగ్స్ స్కీమ్స్ పై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే ప్రభుత్వం నిర్వహించే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై అందిస్తున్న వడ్డీ రేట్లే ఎక్కువగా ఉన్నాయని తమ ప్రకటనలో పేర్కొన్న కేంద్రం.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించి నిర్ణయం తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారంటే..
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వర్తించే వడ్డీ రేట్లను నిర్ణయించే క్రమంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫార్సులు, ఆదాయ పన్ను సంబంధిత ప్రయోజనాలు, ఇతర పథకాలపై వడ్డీ రేట్లు వంటి అంశాలు ఆ జాబితాలో ఉంటాయని మంత్రి పంకజ్ చౌదరి సభకు తెలిపారు.

వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి
పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకాలు
5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్ స్కీమ్ : 7% వడ్డీ
3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్ స్కీమ్ : 6.9% వడ్డీ
2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్ స్కీమ్ : 6.8% వడ్డీ
1-సంవత్సరం కాలపరిమితి కలిగిన డిపాజిట్ స్కీమ్ : 6.6% వడ్డీ
5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన రికరింగ్ డిపాజిట్ స్కీమ్ : 5.8% వడ్డీ
అత్యధికంగా నెలవారీ ఆదాయ పథకం స్కీమ్‌పై 7.1% వడ్డీ

 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ : PPF డిపాజిట్లపై ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తోన్న వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ : SCSS డిపాజిట్లపై ప్రభుత్వం 8% వడ్డీ రేటు అందిస్తోంది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ : NSC డిపాజిట్లపై ప్రభుత్వం అందించే వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.

సుకన్య సమృద్ధి యోజన : SSY డిపాజిట్లపై ప్రభుత్వం అందించే వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం అందించే వడ్డీ రేటు 7.2 శాతంగా ఉంది.

Trending News