మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ అనేది పెట్టుబడి పెట్టేందుకు మంచి ప్రత్యామ్నాయం. మార్కెట్ ఎగుడుదిగుడులున్నా క్రమం తప్పక ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
మీ దగ్గర డబ్బులుండి..ప్రతి నెలా పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు. ఈ పద్థతి ఆధారంగా మీరు 30 ఏళ్ల పెట్టుబడి పెడితే 10 కోట్ల కంటే ఎక్కువ సంపాదించవచ్చు. దీనికోసం మ్యూచ్యువల్ ఫండ్స్‌లో 3 ఫార్ములాలు పాటించాల్సి ఉంటుంది. ఆ ఫార్ములాలు ఏంటనేది తెలుసుకుందాం..
మ్యుచ్యువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ ద్వారా పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయి. మార్కెట్ ఎగుడు దిగుడులున్నా..ప్రతి నెలా నిశ్చితమైన మొత్తం పెట్టుబడి పెడితే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో నెట్ అస్సెట్ విలువలో పెరుగుదల ఉంటుంది.
పెట్టుబడి పెట్టేందుకు ఫార్ములా
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు 2 పద్ధతులున్నాయి. మొదటిది 15, 15,15. ఈ పద్ధతి ప్రకారం ఒకవేళ ఎవరైనా వ్యక్తి ప్రతి నెలా 15 వేల రూపాయలు 15 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే ఆ వ్యక్తికి 15 శాతం రిటర్న్స్ చొప్పున దాదాపుగా 1.02 కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు.
రెండవ విధానంలో..15,15,30. ఈ విధానంలో ఎవరైనా వ్యక్తి ప్రతి నెలా 15 వేల చొప్పున 30 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే..15 శాతం రిటర్న్ చొప్పున 10.51 కోట్ల రూపాయలు చేరుకుంటుంది. అంటే 54 లక్షలు పెట్టుబడి పెడితే...రిటర్న్స్ పెరిగి 9.97 కోట్లవుతుంది. ఎవరైనా వ్యక్తి మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ దీర్ఘకాలం కోసం పెడితే అధిక ప్రయోజనం కలుగుతుంది.
ఐదేళ్ల వ్యవధిలో నష్టం కలిగే అవకాశం
ఎవరైనా వ్యక్తి 25 ఏళ్ల ఇన్వెస్టర్ ఎస్ఐపీలో పెట్టుబడికి ఐదేళ్లు ఆలస్యం చేస్తే సంపాదనపై ప్రభావం పడుతుంది. ఒక ఇన్వెస్టర్ 30 ఏళ్ల వయస్సులో ప్రతి నెలా 5000 చొప్పున 25 ఏళ్లు పెట్టుబడి పెడతాడు. అతనికి అప్పుడు 12 శాతం రిటర్న్ చొప్పుున మెచ్యూరిటీ సమయంలో మొత్తం 84,31,033 రూపాయలు లభిస్తాయి. అప్పటికి ఇన్వెస్టర్ వయసు 55 ఏళ్లవుతుంది.
ఒకవేళ అదే ఇన్వెస్టర్ 25 ఏళ్ల వయస్సుకే ఎస్ఐపీ ప్రారంభిస్తే..30 ఏళ్లు పూర్తవుతుంది. అంటే మరో ఐదేళ్లు పెరుగుతుంది. ఫలితంగా 12 శాతం రిటర్న్ చొప్పున మెచ్యూరిటీ పూర్తయ్యాక అతనికి 1,52,60,066 రూపాయలు లభిస్తాయి.
ఇప్పుడు ఇదే లెక్కల్ని కాస్త క్షుణ్ణంగా అర్ధం చేసుకుంటే..25 ఏళ్ల వయస్సులో పెట్టుబడి ప్రారంభిస్తే 68 లక్షల రూపాయలు అదనంగా లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook