Saving Tips: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఏడాదికి రూ.1.5 లక్షల ఆదా చేసుకోండి

PPF Account: ప్రస్తుతం చాలా మంది సంపాదించిన డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. డబ్బు పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉండడంతో అధిక వడ్డీ వచ్చే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారికి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 02:44 PM IST
Saving Tips: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఏడాదికి రూ.1.5 లక్షల ఆదా చేసుకోండి

PPF Account: ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇదేసమయంలో పేదల నుంచి ఉపాధి పొందుతున్న వారి వరకు వివిధ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేవిధంగా ప్రజలను పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. వీటిలో పీపీఎఫ్ పథకం కూడా ఒకటి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ద్వారా పొదుపు చేసే అవకాశాన్ని పొందుతారు . అదే సమయంలో ప్రజలు కూడా పీపీఎఫ్ ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ పథకం ద్వారా ప్రజలు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టవచ్చు. దాని నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకంలో ఖాతా 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అయితే కొంత సమయం తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఖాతా నుంచి పాక్షికంగా నగదును ఉపసంహరణ చేసుకోవచ్చు.

ఒకవేళ వ్యవధి పెంచుకుంటే మిగిలిన డబ్బుల్లోంచి 60 శాతం డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ కంటే ముందు డబ్బులు తీయాలంటే.. ఎమర్జెన్సీ కిందే తీయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ 15 ఏళ్ల లాక్‌ఇన్ పీరియడ్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 5వ ఏడాది పూర్తయిన తరువాత పీపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కొద్దిగా డబ్బులు తీయవచ్చు. అంటే ఉదాహరణకు 2015లో మీరు పీపీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే.. 2020-21లో పీపీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేయగలరు. 

పీపీఎఫ్ పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం 7.1 శాతం చొప్పున వడ్డీని అందిస్తోంది. ఏదైనా భారతీయ పౌరుడు ఎవరైనా పీపీఎఫ్‌లో ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.500 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ప్రతి ఏడాది ఎంత పెట్టుబడి పెడుతున్నామనేది చాలా ముఖ్యం. 

ప్రభుత్వం అమలు చేసే పీపీఎఫ్ పథకంలో ఏటా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దీంతో ప్రజలు ప్రతి ఏటా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అదే సమయంలో పీపీఎఫ్‌పై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు.

Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్  

Also Read: Chalapathi Rao: ఆరోజుల్లోనే క్రేజీ లవ్ స్టోరీ.. వారంలో పెళ్లి.. 27 ఏళ్లకే భార్య మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News