Dearness Allowance: కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రెండు సార్లు అంటే జనవరి, జూలై నెలల్లో డీఏ పెంచుతుంటుంది. అదే సమయంలో కేంద్రాన్ని బట్టి కాకున్నా..అటూ ఇటులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏ పెంచుతుంటాయి. ఇదొక అనివార్యమైన ప్రక్రియగా మారిపోయింది.
ప్రతి యేటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ అంటే కరవుభత్యం పెంచుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా విడుదల చేసే ఏఐసీపీఐ సూచీ ప్రకారం ప్రతి యేటా జనవరి, జూలైల్లో డీఏ పెంపు ఉంటుంది. 2023 జనవరిలో 4 శాతం డీఏ పెంచడంతో 42 శాతానికి చేరుకుంది. ఇప్పుడు జూలైలో రెండవ దఫా డీఏ పెంపు ఉండనుంది. జూలై నుంచి సెప్టెంబర్ నెలల్లోగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈసారి కూడా డీఏ 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుు జూలైలో డీఏ ఎంత పెంచుతారనే లెక్కల్లో ఉండగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డీఏను 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న డీఏ పెంపు నిర్ణయంతో 7.5 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. రాష్ట్రంలోని సీహోర్ జిల్లా గిల్హౌర్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ డీఏ పెంపును ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో 4 శాతం అంతముందని..ఇప్పుడు 4 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచుతుండటంతో ఆ తేడా ఇకపై ఉండదని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2023 నుంచి 7వ వేతన సంఘం ప్రకారం 38 శాతం డీఏ అందుతోంది. ఇప్పుడు 4 శాతం పెంచడంతో 42 శాతానికి చేరనుంది.
Also Read: Top Export Cars: విదేశాల్లో హల్‌చల్ చేస్తున్న మారుతి సుజుకి చీప్ అండ్ బెస్ట్ కారు, ధర కేవలం 4 లక్షలే
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచడంతో ప్రభుత్వంపై ఏడాదికి వేయి కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. అయితే పెరిగిన డీఏ ఎప్పట్నించి అమల్లోకి వచ్చేది ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించలేదు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డీఏ పెంపు గురించి డిమాండ్ చేస్తున్నాయి. జూలై 2023 నుంచి పెరిగిన డీఏ 4 శాతం అమలు చేయవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 7.5 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది ఎన్నికలుండటంతో ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 4 శాతం డీఏ ప్రకటించినట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook