Bank Holidays In March 2021: కొత్త నెల వచ్చిందంటే చాలు మొదటగా బ్యాంక్ సెలవుల వివరాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా గతేడాది ప్రారంభమైన కరోనా వైరస్ వ్యాప్తి తరువాత నుంచి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి 2021లో 10 రోజులు బ్యాంకులకు సెలవు దినాలు ఉన్నాయి.
మీరు మీ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లు తెరవడం, పాన్, ఆధార్ కార్డులను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకోవడం లాంటివి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులకు బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India) మార్చి నెలలో బ్యాంకు సెలవుల వివరాలు వెల్లడించింది. సాధారణంగా ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు ఉద్యోగులకు అవి సెలవు దినాలుగా పరిగణిస్తారు. మార్చి నెలలో మహా శివరాత్రి 11వ తేదీన, 14న హోలీ పండుగ ఉన్నాయి.
Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే
మార్చి 2021 బ్యాంక్ సెలవు దినాలు (Bank Holidays March 2021)
- మార్చి 7, 2021 - ఆదివారం
- మార్చి 11, 2021 - మహా శివరాత్రి
- మార్చి 13, 2021 - రెండో శనివారం
- మార్చి 14, 2021 - ఆదివారం
- మార్చి 15, 16, 2021 - బ్యాంకు యూనియన్ సమ్మె
- మార్చి 21, 2021 - ఆదివారం
- మార్చి 27, 2021 - నాలుగో శనివారం
- మార్చి 28, 2021 - ఆదివారం
- మార్చి 30, 2021 - హోలీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook