Jio IPL plans: ఐపీఎల్​ 2022 కోసం జియో ధన్ ధనా ధన్​ ఆఫర్లు!

Jio IPL plans: ఐపీఎల్​ 2022 కోసం.. టెలికాం దిగ్గజం జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్​ను అందుబాటులోకి తెచ్చింది. డిస్నీప్లస్ హాట్​స్టార్ ఉచిత సబ్​స్క్రిప్షన్​ తెచ్చిన ఈ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 07:05 PM IST
  • జియో నుంచి కొత్త రిఛార్జ్​ ప్లాన్స్​
  • ఐపీఎల్​ 2022 కోసం అదిరే ఆఫర్లు
  • డిస్నీప్లస్​ హాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్ ఉచితం!
Jio IPL plans: ఐపీఎల్​ 2022 కోసం జియో ధన్ ధనా ధన్​ ఆఫర్లు!

Jio IPL plans: క్రికెట్ లవర్స్​కు పండుగ లాంటి.. ఐపీఎల్​ 2022 ప్రారంభమైంది. అయితే అందరూ టీవీలోనే ఐపీఎల్​ చూసే టైం లేకపోవచ్చు.. అందుకే మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ చూస్తుంటారు. ఐపీఎల్​ను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అయిన.. డిస్నీప్లస్​ హాట్​స్టార్​లో ప్రసారమవుతుంది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్​ లవర్స్​ కోసం ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది.

జియో ఐపీఎల్ ఆఫర్లు ఇలా..

రూ.279 క్రికెట్ యాడ్​-ఆన్ ప్లాన్​తో రీఛార్జ్ చేసుకుంటే.. డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ను ఉచితంగా వినియోగించుకునే వీలుంది. అయితే ఈ ప్లాన్​తో ఎలాంటి వాయిస్​కాల్​ ఆఫర్లు లేవు. ఇందులో 15 జీబీ 4జీ హై స్పీడ్ డేటా, ఓటీటీ సబ్​స్క్రిప్షన్ మాత్రమే లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే లభిస్తుందని వెల్లడించింది జియో.

మరిన్ని ఆఫర్లు ఇలా..

ఐపీఎల్​ 2022ని దృష్టిలో ఉంచుకుని జియో మొత్తం నాలుగు రకాల ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. రోజువారీ డేటా లిమిట్​ 2 జీబీతో.. ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

  • మొదటిది రూ.499 ప్లాన్.. దీని వ్యాలిడిటీ 28 రోజులు
  • రూ.799 ఆఫర్​ 56 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వస్తుంది.
  • రూ.1,066 ప్లాన్​ 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
  • రూ.3,119 ప్లాన్​ను ఏడాది (365 రోజుల) వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చింది జియో.
  • ఇదే కాకుండా.. ప్రతి రోజూ 2.5 జీబీ డేటా, 365 రోజలు వ్యాలిడిటీతో మరో ప్లాన్​ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఇక రూ.1,499 ప్లాన్​తో 84 రోజుల పాటు డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ను స్ట్రీమ్​ చేయొచ్చు. దీనితో పాటు రోజూ 2 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఇక రూ.4,199 ప్లాన్​తో.. రోజుకు 3జీబీ డేటా, డిస్నీప్లస్​ హాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్​ను ఏడాది పాటు ఎంజాయ్​ చేయొచ్చు.

Also read: Akasa Air: ఆకాశ ఎయర్ విమానాల ప్రారంభం అప్పటి నుంచే- వెలువడిన ప్రకటన!

Also read: Indian Exports: 2021-22లో భారత స్మార్ట్​ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News