Renault Triber @ Rs 6.3 Lakhs: అత్యంత చౌకైన 7 సీటర్ కారు.. అది కూడా కేవలం 6.3 లక్షలే!

Get Renault Triber @ Rs 6.3 Lakhs: దేశంలో ఇటీవలి కాలంలో 7 సీటర్ లేదా ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కంఫర్ట్ జర్నీ కావాలంటే 7 సీటర్ మంచి ప్రత్యామ్నాయం. ఇప్పుడు మీకు అతి తక్కువ ధరలో లభించే 7 సీటర్ కారు గురించి వివరాలు అందిస్తాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 07:32 PM IST
Renault Triber @ Rs 6.3 Lakhs: అత్యంత చౌకైన 7 సీటర్ కారు.. అది కూడా కేవలం 6.3 లక్షలే!

Get Renault Triber @ Rs 6.3 Lakhs: దేశంలో ప్రస్తుతం 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్లు ఏమున్నాయా అని చూస్తున్న పరిస్థితి. 5 సీటర్ కార్లతో పోలిస్తే 7 సీటర్ కార్లతో ప్రయోజనాలు అధికం. పెద్ద ఫ్యామిలీకు సరిగ్గా సెట్ అవుతుంది. 

మొన్నటి వరకూ 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ కార్లంటే మక్కువ చూపిన ప్రజలు ఇప్పుడు 7 సీటర్ లేదా ఎస్‌యూవీ కార్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరకు లభ్యమయ్యే 7 సీటర్ల కార్ల కోసం అణ్వేషిస్తున్నారు. 7 సీటర్ కార్లు పెద్ద కుటుంబానికి అనువుగా ఉండటమే కాకుండా కమర్షియల్‌‌గా ఆలోచించినా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే మీ కోసం చవకైన 7 సీటర్ కారు వివరాలు అందిస్తున్నాం. ఈ కారు ధర కేవలం 6.5 లక్షల రూపాయలే. ఆ కారు రీనాల్ట్ ట్రైబర్.

రీనాల్ట్ ట్రైబర్ అనేది దేశంలోని తొలి చవకైన ఎంపీవీ కార్లలో ఒకటి. ఈ కారు ధర 6.34 లక్షల రూపాయల్నించి ప్రారంభమై 8.98 లక్షల వరకూ ఉంటుంది. ఇది ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర మాత్రమే. ఇందులో నాలుగు వేరియంట్లు RXE, RXL, RXT,RXZ అందుబాటులో ఉన్నాయి. రెనో ట్రైబర్ 5 మోనోటోన్, 5 డ్యూయల్ టోన్ షేడ్స్‌లో లభిస్తుంది. ఈ ఎంపీవీ 7 సీటర్‌తో వస్తుంది. ఇందులో బూట్ స్పేస్ ఎక్కువ. అవసరం లేదనుకుంటే మూడవ వరుసకు డౌన్ చేసి బూట్ స్పేస్ ఇంకా పెంచుకోవచ్చు.

Also Read: PF Withdrawal: పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

రీనాల్ట్ ట్రైబర్ ఇంజన్, ప్రత్యేకతలు

ఇందులో 1 లీటర్ 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ 5 స్పీడ్ మేన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీతో అనుసంధానించబడింది. ఈ కారు లీటర్‌‌కు 18-19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 

ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పాటు 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , హైడ్ ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, స్టీరింగ్ మౌంటెడ్ మ్యూజిక్, ఫోన్ కంట్రోల్ ఉన్నాయి. ఎంపీవీలో రెండు, మూడు వరుసల్లో  ఏసీ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్, సెంటర్ కన్సోల్  కూల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. 

సేఫ్టీలో భాగంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనుసంధానమైంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ , ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. రీనాల్ట్ ట్రైబర్ కారులో 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఈబీడీతో పాటు ఏబీఎస్, రేర్ పార్కింగ్ సెన్సార్, రేర్ వ్యూ కెమేరా ఇతర ప్రత్యేకతలు.

Also Read: Debit Card Tips 2023: డెబిట్ కార్డు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News