How to reduce electricity bill: ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేడిని తట్టుకోవడానికి ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు విపరీతంగా వాడుతాం. దీంతో కరెంటు బిల్లు (electricity bill) తడిసి మోపుడవుతోంది. మీ జేబులు చిల్లులు పడకుండా మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఇలా చేస్తే చాలు
1. రేటింగ్ చూసుకోండి
ప్రస్తుతం స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ట్రెండ్ నడుస్తోంది. AC, కూలర్ మరియు ఫ్రిజ్ వంటి ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు.. రేటింగ్ చూసుకోవాలి. రేటింగ్ ఎక్కువగా ఉంటే విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఇంటి కోసం ఎల్లప్పుడూ 5 లేదా 4 స్టార్ రేటింగ్ ఉన్న వాటిని తీసుకోవాలి.
2. లైట్లు ఆఫ్ చేయండి
కరెంటును ఆదా చేయాలంటే.. పగటిపూట లైట్లు ఆఫ్ చేయండి. అంతేకాకుండా LED బల్బులను ఎక్కువగా ఉపయోగిస్తే కరెంట్ ను ఆదా చేయవచ్చు. గది నుండి బయటకు వెళ్లేటప్పుడు ఫ్యాన్లు, కూలర్, ఏసీతో సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను స్విచ్ ఆఫ్ చేయండి.
3. అన్‌ప్లగ్ చేయండి
మీరు ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించకుంటే, దాన్ని అన్‌ప్లగ్ చేయండి. దాని వల్ల నెలకు విద్యుత్ బిల్లులో 10% వరకు ఆదా చేయవచ్చు. టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్ మరియు మొబైల్ ఛార్జర్లు స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ విద్యుత్ వినియోగిస్తూనే ఉంటాయి. కాబట్టి ఉపయోగంలో లేనప్పుడు వాటిని అన్‌ప్లగ్ చేయాలి.
4. పాత ఎలక్ట్రానిక్ పరికరాలకు స్వస్తి పలకండి
పాత ఎలక్ట్రానిక్ పరికరాల స్థానంలో స్మార్ట్ పరికరాలను ఉపయోగించండి. అవి విద్యుత్ బిల్లును తగ్గిస్తాయి. తద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనం పొందవచ్చు.
5. AC మరియు ఫ్రిజ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
సీజన్ ప్రారంభంలోనే మీ ACలు సర్వీస్ చేయించండి. బాగా పనిచేస్తున్నాయో లేదా చూసుకోండి. అందువల్ల కూలింగ్‌లో అదనపు పవర్ వినియోగించబడదు. రిఫ్రిజిరేటర్‌ను క్రమ పద్ధతిలో పూర్తిగా శుభ్రం చేయాలి మరియు డోర్‌ని ఎల్లప్పుడూ సరిగ్గా మూసి ఉంచాలి. అలాగే, వెదర్ కండిషన్ బట్టి శీతలీకరణ బటన్‌ను సెట్ చేయండి.
Also Read: EPF Nomination Benefits: EPFO ఈ-నామినేషన్ పూర్తి చేయకపోతే రూ.7 లక్షల బీమా కోల్పోయినట్టే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook