Adani and Sebi Chairperson Allegations : అమెరికాకు చెందిన ప్రముఖ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఏకంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబి చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ అలాగే ఆమె భర్తకు అదానీ గ్రూపుతో ముడిపడి ఉన్న విదేశీ ఫండ్ ఖాతాల్లో వాటా కలిగి ఉన్నారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అటు సెబీ చైర్ పర్సన్ అలాగే అదానీ గ్రూపు నిరాధారమైనవని ఖండించారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు గురించి మొత్తం 10 పాయింట్లలో అర్థం చేసుకుందాం.
1. సెబీ చైర్‌పర్సన్ , ఆమె భర్తపై చేసిన ఆరోపణలు ఇవే:
హిండెన్‌బర్గ్, శనివారం విడుదల చేసిన తన నివేదికలో, అదానీ గ్రూప్‌లోని అక్రమ మార్గంలో పెట్టుబడులు పెట్టి, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచిన విదేశీ ఫండ్ హౌసెస్ లో సెబీ చైర్‌పర్సన్ మధాబి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌లకు వాటాలు ఉన్నాయని ఈ రిపోర్టు ఆరోపణలు చేసింది.
2- ఆరోపణలు ఖండించిన సెబీ :
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను ఖండిస్తూ పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ సెబీ చీఫ్ ఆమె భర్త ఒక ప్రకటన విడుదల చేశారు. నివేదికలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, వీటిలో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు.
3- సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ :
అదానీ గ్రూప్ రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. దేశంలోని అత్యున్నత రెగ్యులేటరీ సంస్థ సెబీ అధికారుల ఆరోపణలను విచారించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసింది.
4 - అదానీ కంపెనీలపై విచారణ జరగలేదని రిపోర్టులో సెబీపై ఆరోపణ:
మారిషస్ విదేశీ షెల్ కంపెనీల నుంచి అదానీ కంపెనీలకు వచ్చిన పెట్టుబడులపై SEBI విచారణ జరపలేదని హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపించింది.
Also Read: Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?
5 - విదేశీ ఫండ్‌లలో సెబీ చీఫ్ వాటాలు:
సెబీ చీఫ్ బుచ్, అలాగే ఆమె భర్తకు అదానీ గ్రూప్ స్కామ్‌లో ఉపయోగించిన షాడో 'ఆఫ్‌షోర్ ఫండ్స్' రెండింటిలోనూ వాటాలు కలిగి ఉన్నారని హిండెన్‌బర్గ్ విజిల్‌బ్లోయర్ పత్రాలను చూపించి ఆరోపించింది.
6 - విదేశీ ఫండ్ నిధుల స్కాం ద్వారా అదానీ గ్రూపులోకి నిధుల వరద:
గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీ కొన్ని అస్పష్టమైన ఆఫ్‌షోర్ ఫండ్స్ బెర్ముడా మారిషస్ నిధులను నియంత్రించినట్లు ఆరోపించింది. ఈ విదేశీ అకౌంట్లను మనీ లాండరింగ్ చేయడానికి, మార్కెట్లో షేర్ల ధరను కృత్రిమంగా పెంచడానికి ఈ నిధులను ఉపయోగించారని ఆరోపించింది.
7 - మధాబి బుచ్ దంపతుల మొత్తం సంపద కోటి డాలర్లు.:
IIFLలో ప్రిన్సిపాల్ సంతకం చేసిన ఫండ్ డిక్లరేషన్, పెట్టుబడికి మూలం 'జీతం' అని దంపతుల నికర విలువ 10 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తూ హిండెన్‌బర్గ్ తన తాజా నివేదికలో పేర్కొంది.
8 - గౌతమ్ అదానీ వినోద్ అదానీలపై తీవ్రమైన ఆరోపణలు:
అదానీ గ్రూపు నగదును అక్రమ మానిప్యులేషన్ స్కామ్‌లో వినోద్ అదానీ సృష్టించిన ఆఫ్ షోర్ అకౌంట్లను ఉపయోగింనట్లు పేర్కొన్నారు. విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ఈ అకౌంట్లను ఆఫ్‌షోర్ ఫండ్స్ అంటారు. వీటిని విదేశీ నిధులు అని కూడా అంటారు.
9- సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉదహరించారు:
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా హిండెన్ బర్గ్ నివేదికలో ఉదహరించారు. అదానీకి చెందిన విదేశీ వాటాదారుల వివరాలు, ఎవరు ఆర్థిక సహాయం చేశారనే దానిపై దర్యాప్తు చేసిన వివరాలను కోర్టుకు సెబీ తెలపలేదని రిపోర్టులో పేర్కొంది.
10- బెర్ముడా మారిషస్ నిధులలో వాటాను దాచిపెట్టిన ఆరోపణ:
ప్రస్తుత SEBI చైర్‌పర్సన్ ఆమె భర్త ధవల్ బుచ్ తమ వాటాను వినోద్ అదానీ ఉపయోగించిన ఆప్ షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్స్ లో దాచారని హిండెన్‌బర్గ్ తెలిపింది.
Also Read: Mutual Funds : నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి