Gold Price Today: బంగారం ప్రియులకు దంతేరాస్ పండుగ వేళ గుడ్‌న్యూస్, బంగారం ధర ఎంతంటే

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. దంతేరాస్ పండుగ అందిస్తున్న కానుక కావచ్చు. నిన్నటి వరకూ పెరిగిన బంగారం, వెండి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2021, 08:08 AM IST
  • దంతేరాస్ పండుగ సందర్భంగా బంగారం ప్రియులకు శుభవార్త
  • బంగారం ధరల్లో నిన్నటి నుంచి నిలకడ
  • దేశీయంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 740 రూపాయలు
Gold Price Today: బంగారం ప్రియులకు దంతేరాస్ పండుగ వేళ గుడ్‌న్యూస్, బంగారం ధర ఎంతంటే

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. దంతేరాస్ పండుగ అందిస్తున్న కానుక కావచ్చు. నిన్నటి వరకూ పెరిగిన బంగారం, వెండి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

బంగారం, వెండి ధరలు(Gold and Silver Prices)ప్రతిరోజూ మారుతుంటాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బంగారం ప్రియులకు ఇబ్బంది కల్గించాయి. ఇప్పుడు దంతేరాస్ పండుగ సందర్భంగా బంగారం ప్రియలకు గుడ్‌న్యూస్ చేరింది. నిన్నటి నుంచి బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి..అసలు దంతేరాస్ పండుగకు, బంగారానికున్న సంబంధమేంటనేది తెలుసుకుందాం.

దీపావళి పండుగ వేళ వచ్చేదే దంతేరాస్ పండుగ(Danteras Festival). ఉత్తరాదిన దంతేరాస్‌గా జరుపుకుంటారు. ప్రతియేటా కార్తీకమాసంలోని కృష్ణపక్ష త్రయోదశి రోజున దంతేరాస్ పండుగను జరుపుకుంటారు. నవంబర్ 2వ తేదీ అంటే ఇవాళ దంతేరాస్ పండుగ. ఉత్తరాదిన ఐదురోజుల పాటు జరిగే దీపావళి పండుగ ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుంది. ఇవాళ పండుగ పర్వదినం సందర్భంగా భక్తులు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసిన ఆభరణాల్ని పూజించడం వల్ల అవి రెట్టింపు అవుతాయనేది ఓ ప్రగాఢ నమ్మకం. అందుకే ధనత్రయోదశి ప్రారంభం కంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే  ఈ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిరోజూ పరుగులు పెడుతున్న బంగారం ధరలు నిన్నటి నుంచి నిలకడగా ఉండటం మహిళలకు ఓ గుడ్‌న్యూస్. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల 740 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 47 వేల 740 రూపాయలుగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు(Gold Price Today) ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 850 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51 వేల 100గా ఉంది. అటు ఆర్థిక రాజధాని ముంబైలో(Gold Price in Mumbai) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 740 అయితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47 వేల 740గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold price in Chennai) 45 వేలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 110 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 850 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 770 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 700 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48  వేల 770గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయంలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold price in Hyderabad) ధర 44 వేల 700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 770గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 700 అయితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 770 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 700 కాగా. 24 క్యారెట్ల ధర 48 వేల 770గా ఉంది.

దంతేరాస్ పండుగ సందర్భమని కాకపోయినా..వాస్తవానికి బంగారం ధరల్లో మార్పులు చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. 

Also read: Rs.266 Crore Fraud : తెరపైకి మరో మోసం.. ఆ బ్యాంకులో రూ. 266 కోట్ల మోసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News