Cheap & Best 10-Seater Car: 7-సీటర్ కారెందుకిక..10 సీటర్ అందుబాటులో ఉండగా.. అది కూడా తక్కువ ధరకే

Force Cityline 10-Seater Cars with Low Price: ఇప్పుడు 7 సీటర్ కారు గురించి ఆలోచన వదిలేయండి. తక్కువ ధరలో సరికొత్త 10 సీటర్ వచ్చేసింది. కారు ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 7 సీటర్ ఎందుకిక అంటారు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2023, 09:39 AM IST
Cheap & Best 10-Seater Car: 7-సీటర్ కారెందుకిక..10 సీటర్ అందుబాటులో ఉండగా.. అది కూడా తక్కువ ధరకే

10-seater Force Cityline Car with Low Price: డొమెస్టిక్ కార్ మేకర్ ఫోర్స్ మోటార్స్ ఇటీవలే ఇండియాలో తొలి 10 సీటర్ లాంచ్ చేసింది. ఈ కారు పేరు ఫోర్స్ సిటీలైన్. ఇది ఈ కంపెనీకు చెందిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ అప్‌డేటెడ్ వెర్షన్. కుటుంబసమేతంగా సుదూర ప్రయాణాలకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

ఫోర్స్ సిటీ లైన్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే అన్ని సీట్లు ఫ్రంట్ ఫేసింగ్ కావడం. దాంతో ట్యాక్సీలో ప్రయాణించే అనుభూతి అస్సలుండదు. ఆఫ్ రోడ్ ఎస్‌యూవీని తలదన్నే లుక్స్‌తో ఉంటుంది ఈ కారు. ఫోర్స్ సిటీలైన్‌లో డ్రైవర్ కాకుండా 9 మంది కూర్చోవచ్చు. సాధారణంగా 7 సీటర్ కార్లు 3 వరుసల్లో ఉంటాయి. కానీ ఫోర్స్ సిటీ లైన్‌లో 4 వరుసలుంటాయి. మొదటి వరుసలో ఇద్దరు, రెండవ వరుసలో ముగ్గురు, మూడవ వరుసలో ఇద్దరు, నాలుగవ వరుసలో నలుగురు కూర్చోగలరు. ఈ కారు ధర 16.5 లక్షలతో ప్రారంభమౌతుంది.

ఫోర్స్ సిటీలైన్ సైజ్‌లో చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇందులో 5120 ఎంఎం పొడుగు, 1818 ఎంఎం వెడల్పు, 2027 ఎంఎం ఎత్తు, 3050 ఎంఎం వీల్ బేస్ ఉంటాయి. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 191 ఎంఎం ఉంటుంది. ఈ ఎంయూవీ ఫ్రంట్ డిజైన్ టాటా సుమోలా కన్పిస్తుంది. ఇందులో 2.6 లీటర్ల డీజల్ ఇంజన్ ఉంటుంది. ఇది 91 హార్స్ పవర్, 250 ఎన్ఎం గరిష్ట టార్క్ ఇస్తుంది. ఈ కారు 63.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 5 స్పీడ్ మేన్యవల్ ట్రాన్స్ మిషన్, 3140 కిలో బరువు కలిగి ఉంటుంది.

ఈ కారులో చాలా అద్భుతమైన ఇతర ఫీచర్లు ఉన్నాయి. పవర్ ఫుల్ డ్యూయల్ ఎయిర్ కండీషనింగ్, సెంట్రల్ లాకింగ్ పవర్ విండోస్, మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్స్, రేర్ పార్కింగ్ సెన్సార్, బాటిల్ హోల్డర్, లగేజ్ కోసం ఫోల్టింగ్ టైప్ లాస్ట్ రో ఉన్నాయి. ప్రయాణీకులు హాయిగా కూర్చుని తిరిగి బయటకు రాగలరు.

Also Read: Safest Cars in India: ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే.. వాటి సేఫ్టీ రేటింగ్స్, ధరల వివరాలు ఇదిగో

Also Read: Tata New Car Launch 2023: మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న టాటా.. త్వరలోనే 4 ఎస్‌యూవీలు రిలీజ్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News