FD interest Rate 2023: ఈ బ్యాంకులలో ఎఫ్‌డీలపై అధిక వడ్డీ.. మీ ఆదాయం రెట్టింపు ఖాయం

Bank FD Interest Rate 2023: మీరు సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నారా..? స్టాక్ మార్కెట్ రిస్క్ అని ఆలోచిస్తున్నారా..? అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ అధిక వడ్డీ రేటు లభిస్తుంది..? ఎంత వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి..? వివరాలు ఇవిగో..   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 06:27 PM IST
FD interest Rate 2023: ఈ బ్యాంకులలో ఎఫ్‌డీలపై అధిక వడ్డీ.. మీ ఆదాయం రెట్టింపు ఖాయం

Bank FD Interest Rate 2023: ప్రస్తుతం ప్రతి ఒక్కరు సంపాదించి ప్రతి రూపాయిలో ఎంతోకొంత ఆదా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే చాలా మంది షేర్ మార్కెట్ రిస్క్ అని వెనుకంజ వేస్తున్నారు. మీ డబ్బు సేఫ్‌గా ఉండాలి.. దానిపై ఆదాయం కావాలని మీరు భావిస్తున్నయితే.. మీరు మీ డబ్బును బ్యాంకులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీరు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీ డబ్బు కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లపై అధిక వడ్డీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసి మీరు మంచి లాభాలతో మీ డబ్బును దాదాపు రెట్టింపు చేసుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచిన తర్వాత.. అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే ఇతర పెద్ద బ్యాంకుల కంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తుండడ విశేషం. దేశంలోని పెద్ద బ్యాంకులైన ఎస్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎఫ్‌డీపై కంటే.. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నాయి. ఆ బ్యాంకుల వివరాలు ఇలా..

==> యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీని ఇస్తోంది. ఈ బ్యాంక్ మీకు 1001 రోజుల్లో ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్‌లకు 9 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 9.50 శాతం ఆఫర్ చేస్తోంది. 

==> ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీడిపై ఎక్కువ వడ్డీని ఇస్తోంది. 1001 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 8 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 8.75 శాతం వడ్డీ ప్రయోజనం ఇస్తోంది.

==> నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 1001 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 8 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 8.75 శాతం వడ్డీ లభిస్తోంది. 

==> జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సాధారణ ప్రజలకు 1001 రోజుల ఎఫ్‌డీలపై 8.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.80 శాతం వడ్డీని అందిస్తోంది.

==> మీరు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 1001 రోజుల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం ఇన్వెస్ట్ చేస్తే.. మీకు సంవత్సరానికి 8.51 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు సీనియర్ అయితే బ్యాంకు మీకు 8.76 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

==> ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మీకు 1001 రోజుల ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్లకు 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.75 శాతం వడ్డీ లభిస్తోంది.

Also Read: NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?  

Also Read: Rishabh Pant: పంత్ పురాగమనంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News