Banks closed for 13 days in December 2022: 2022 నవంబర్ నెల ముగింపునకు వచ్చింది.. మరో 5 రోజుల్లో డిసెంబర్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యం బ్యాంకుల వెళ్లే కస్టమర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులు పని చేయవు. ఇందులో కొన్ని రాష్ట్ర, నిర్దిష్ట బ్యాంకు సెలవులతో పాటు మరికొన్ని ఉన్నాయి. 13 రోజులు కాబట్టి ప్రతిరోజు బ్యాంకు లావాదేవీలు జరిపే వారు ఈ డేట్స్ చెక్ చేసుకొని వెళ్లడం మంచిది. ఎందుకంటే ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోవడం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది.
2022 డిసెంబర్ నెలలో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. అయితే బ్యాంకుల పని ఆన్‌లైన్‌లో మాత్రం కొనసాగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చేసే పనులు చేయవచ్చు. డిసెంబర్ నెలలో 4 ఆదివారాలు కాకుండా.. రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో క్రిస్మస్ పండగ, నూతన సంవత్సర వేడుకలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంటుందన్న విషయం తెలిసిందే.
13 రోజులలో కొన్ని బ్యాంకు సెలవులు జాతీయమైనవి. ఆ రోజు దేశం మొత్తం బ్యాంకుల్లో సెలవు ఉంటుంది. ఆయా రాష్ట్రాల పండుగల ఆధారంగా బ్యాంకులు మూసి ఉంటాయి. రాష్ట్ర సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవవు. జాతీయ స్థాయిలో డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
డిసెంబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్ ఇదే:
డిసెంబర్ 3 – శనివారం – సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ (గోవాలో బ్యాంకు మూసివేత)
డిసెంబర్ 4 – ఆదివారం
డిసెంబర్ 10 – రెండో శనివారం
డిసెంబర్ 11 – ఆదివారం
డిసెంబర్ 12 – సోమవారం – పా-టాగన్ నెంగ్మింజ సంగం (మేఘాలయలో బ్యాంక్ మూసివేయబడింది)
డిసెంబర్ 18 – ఆదివారం
డిసెంబర్ 19 – సోమవారం – గోవా విమోచన దినం (గోవాలో బ్యాంకు మూసివేయబడింది)
డిసెంబర్ 24 – శనివారం – నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకు మూసివేయబడతాయి)
డిసెంబర్ 25 – ఆదివారం
డిసెంబర్ 26 – సోమవారం – లాసంగ్, నమ్సంగ్ (మిజోరం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకు మూసివేయబడతాయి)
డిసెంబర్ 29 – గురువారం – గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు (చండీగఢ్‌లో బ్యాంక్ మూసి ఉంటుంది)
డిసెంబర్ 30 – శుక్రవారం – యు కియాంగ్ నంగ్వా (మేఘాలయలో బ్యాంక్ మూసి ఉంటుంది)
డిసెంబర్ 31 – శనివారం – నూతన సంవత్సర వేడుకలు (మిజోరంలో బ్యాంకు మూసి ఉంటుంది)
Also Read: Veera Simhaa Reddy First Single : పగిలిపోయిందని చూపించిన తమన్.. అది దేవి శ్రీ ప్రసాద్‌కు కౌంటరా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook