Bank holidays 2022 March: మార్చిలో 13 రోజులు బ్యాంక్​ సెలవులు- మరిన్ని వివరాలు ఇలా..

Bank holidays 2022 March: వచ్చే నెలలో బ్యాంకులకు సెలవు దినాలు ఖరారయ్యాయి. ఆర్​బీఐ ప్రకారం మొత్తం 13 సెలవు దినాలు ఉన్నాయి. సెలవులపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 10:14 AM IST
  • వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు!
  • మొత్తం 13 సెలవు దినాలు గుర్తింపు
  • ఆర్​బీఐ గుర్తించిన హాలీడేస్ జాబితా
Bank holidays 2022 March: మార్చిలో 13 రోజులు బ్యాంక్​ సెలవులు- మరిన్ని వివరాలు ఇలా..

Bank Holidays 2022 March: మరో మూడు రోజుల్లో ఫిబ్రవరి ముగియనుంది. మార్చి నెలలో మీకు బ్యాంకులో పని ఉంటే ఈ విషయం మీకోసమే. బ్యాంకులు వచ్చే నెలలో మొత్తం 13 రోజులు సెలవులు ఉంటాయి.

బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్​బీఐ ప్రకారం వచ్చే నెలకు సంబంధించి సెలవుల జాబితా విడుదలైంది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13 రోజులు సెలవులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. సెలవులను స్థానిక పండుగలు, ఇతర ప్రత్యేక దినాలను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు.

మరి ఎక్కడెక్కడ బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయొ ఇప్పుడు తెలుసుకుందాం.

2022 మార్చి బ్యాంక్​ సెలవులు..

మార్చి 1- మహాశివరాత్రి దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
మార్చి 3- లోసర్​ సిక్కిం
మార్చి 4- చాప్ చర్ కుట్- (మిజోరం)
మార్చి 6- ఆదివారం సాధారణ సెలవు
మార్చి 12- రెండో శనివారం సాధారణ సెలవు
మార్చి 13- ఆదివారం సాధారణ సెలవు
మార్చి 17- హోలికా దహన్​ 
మార్చి 18- హోలీ
మార్చి 19- హోలీ/
మార్చి 20- ఆదివారం సాధారణ సెలవు
మార్చి 22- బిహార్​ దివాస్​
మార్చి 26- నాలుగో శనివారం

మార్చి 27- ఆదివారం

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. బ్యాంకులు సెలవుల్లో ఉన్నా.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్​, ఆర్​టీజీఎస్​, ఐఎంపీఎస్​, యూపీఐ పేమెంట్స్ యథావిథిగా పని చేస్తాయి. ఈ సేవలను 24x7 వినియోగించుకోవచ్చు. ఎఫ్​డీ, లోన్ వంటి​ ఇతర అవసరాల గురించి నేరుగా బ్యాంకులో పని ఉంటే మాత్రం సెలవులను బట్టీ ప్లాన్ చేసుకోవాలి.

Also read: Redmi Smart LED TV X43 Offer: 14 వేల బంపరాఫర్.. అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ!!

Also read: Amazon Sale: అమెజాన్ సేల్ అద్దిరిపోయే ఆఫర్స్.. వీటిపై 50% డిస్కౌంట్ సేల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News