Air India Airbus: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా.. అమెరికన్ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ నుండి 250 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియా.. తాజాగా బోయింగ్ సంస్థ నుండి మరో 220 విమానాలను కొనుగోలు చేసేందుకు డీల్ సెట్ చేసింది. మెుత్తం ఈ 470 ఎయిర్‌క్రాఫ్ట్ డీల్ ధర 80 బిలియన్ల డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. అక్టోబర్ 2021లో ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది టాటా గ్రూప్. 17ఏళ్ల అనంతరం తొలిసారి విమానాలను కొనుగోలు చేస్తుంది ఎయిర్ ఇండియా.
కొనుగోలు చేసినవి ఇవే...
40 ఎయిర్‌బస్ ఏ350 విమానాలు, 210 ఎయిర్‌బస్ ఏ320/321 నియో విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777-9ఎస్ ఎయిర్ క్రాప్ట్స్, 190 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాప్ట్స్ ను కొనుగోలు చేయనున్నట్లు ఎయిర్ ఇండియా నిన్న ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలి విమానం 2023 చివరలో రానుంది. మిగతా విమానాలు 2025 జూలై నుంచి అందుతాయిని ప్రకటించింది.
మెగా డీల్ పై నేతల హర్షం
అదే విధంగా ఎయిర్ బస్, బోయింగ్ లతో ఎయిర్ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో విమానయాన రంగం అద్భుతంగా పురోగమిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. "ఎయిరిండియా మరియు బోయింగ్ మధ్య కుదిరిన డీల్ ను చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు'' అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ డీల్స్ పై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కుడా హర్షం వెలిబుచ్చారు.
Also Read: OnePlus 11 5G Phone: వాలెంటైన్స్ డే నాడే అమ్మకాలు ప్రారంభించిన వన్‌ప్లస్ 11 5G ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Air India: బాహుబలి డీల్... ఎయిర్ ఇండియాకు 470 కొత్త విమానాలు..