7th Pay Commission Updates: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలు అందడంతో డీఏ పెంపుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా వస్తున్న సందేహాలకు తెరపడింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల నుంచి డీఏ పెరగడం ఖరారైంది. జూన్ నెల ఏఐసీపీఐ గణాంకాలు వెలువడ్డాయి, మేలో ఈ సూచీ 129 ఉండగా..జూన్ నెలలో 129.2గా ఉంది. గత కొద్దినెలలుగా ఇది క్రమంగా పెరుగుతుండటంతో కనీసం 4 శాతం వరకూ డీఏ పెరగవచ్చని తెలుస్తోంది.
జూన్ నెలలో ఏఐసీపీఐ నివేదిక
గతంలో అంటే మే నెలలో వెలువడిన ఏఐసీపీఐ నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా నిలిచింది. ఫిబ్రవరి తరువాత ఏఐసీపీఐ సూచిక వివరాలు పరిశీలించగా..జూన్ నెలలో ఇంకా ఎక్కువే ఉంటుందని ఆశించారు. అందుకు తగ్గట్టే జూన్ నెల సూచీ కూడా స్వల్పంగా పెరిగింది. దాంతో డీఏ కనీసం 4 శాతం పెరగవచ్చని అంచనా. ఏప్రిల్ నుంచి ఏఐసీపీఐ సూచీలో పెరుగుదల కన్పిస్తోంది. మే నెలలో 1.3 పాయింట్లు పెరగగా..ఇప్పుడు 129.2 కు చేరుకుంది.
ఫిబ్రవరి నుంచి పెరుగుతున్న ఏఐసీపీఐ నివేదిక
జనవరి 2022లో ఏఐసీపీఐ నివేదిక సూచీ 125.1 ఉంటే..ఫిబ్రవరిలో కాస్త తగ్గి 125కు చేరుకుంది. ఫిబ్రవరి గణాంకాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఏఐసీపీఐ సూచీ పెరిగితేనే డీఏ పెరిగేందుకు అవకాశాలుంటాయి. అయితే ఆ తరువాత నుంచి సూచీ వేగంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 129.2కు చేరుకుంది.
ఏఐసీపీఐ సూచీ ఎలా పెరిగింది
ఫిబ్రవరితో పోలిస్తే మార్చ్ నెలలో ఏఐసీపీఐ సూచీ 1 పాయింట్ పెరగగా..126కు చేరుకుంది. ఆ తరువాత ఏప్రిల్ నెలలో 1.7 పాయింట్లు పెరిగి 127.7 కు చేరింది. ఆ తరువాత మే నెలలో 1.3 పాయింట్లు పెరిగి 129కు చేరుకోగా..జూన్ వచ్చేసరికి 2 పాయింట్లు పెరిగి 129.2కు చేరుకుంది.
డీఏ ఒకవేళ 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 38 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతంగా ఉంది. డీఏ 38 శాతం పెరగడం వల్ల జీతం కూడా బాగా పెరుగుతుంది. 4 శాతం డీఏతో కనీస, అత్యధిక జీతాలు పెరగనున్నాయి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు అంచనా ఏఐసీపీఐ సూచీ ఆధారగంగా నిర్ణయిస్తారు. ఈ సూచీ కేంద్ర కార్మిక శాఖ నుంచి జారీ అవుతుంది. ఈ సూచీని 88 కేంద్రాలు , దేశం కోసం తయారు చేశారు.
Also read: Income tax return:గడువులోగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook