7th Pay Commission: 7వ వేతన సంఘం డీఏ పెంపు విషయమై కీలకమైన అప్‌డేట్ విడుదలైంది. మీడియా నివేదికల ప్రకారం కేబినెట్ భేటీ అనంతరం ఆగస్టు నెలలో నిర్ణయం తీసుకోనున్నారు. సిబ్బంది ఒక్కొక్కరికి 40 వేల వరకూ జీతం పెరగనుంది.
7వ వేతన సంఘం డీఏ పెంపు జూలైలో వస్తుందని ఆశించారు. కానీ జూలై నెల దాదాపుగా అయిపోవచ్చింది. డీఏ పెంపుపై కీలక నిర్ణయం ఆగస్టు నెలలో తీసుకోనున్నారని తెలుస్తోంది. కరవు భత్యం పెంపు దాదాపు ఖరారైనా, ఎంతమేరకు పెంచుతారనేది కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 40 వేలవరకూ పెరగవచ్చని తెలుస్తోంది.
ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం డీఏ పెంపు ఎంతనేది ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ప్రారంభంలో అయితే 4-5 శాతం ఉండవచ్చని ఆశించినా..ఇప్పుుడు 6 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 6 శాతం పెరిగితే..34 నుంచి 40 శాతానికి చేరుకోనుంది. మీడియా నివేదికల ప్రకారం కరవు భత్యం ప్రకటనైతే జూలై నెలాఖరుకు ఉండవచ్చు. కొన్ని నివేదికలైతే జూలై 31న ఉండవచ్చని వెల్లడించాయి. అంటే ఆగస్టు జీతంలో మార్పు కన్పిస్తుంది. ఉద్యోగుల జీతం 40 వేలవరకూ పెరగవచ్చు.
ఏఐసీపీఐ గణాంకాలు ఫబ్రవరి నుంచి పెరుగుతున్నాయి. మే నెలలో ఏఐసీపీఐ 129 వరకూ తీసుకెళ్లింది. అంటే 1.3 అంకెలు పెరిగింది. జూన్ లో 6 శాతం పెరుగుదల రావచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం 56 వేల 9 వందలుంటే..6 శాతం పెరుగుదల తరువాత ప్రతినెలా దాదాపుగా 3 వేల 414 రూపాయలు పెరుగుతుంది. 34 శాతం ప్రకారం ప్రస్తుతం డీఏ నెలకు 19 వేల 346 రూపాయలుండగా..22 వేల 760 రూపాయలవుతుంది. అంటే ఏడాదికి జీతంలో 40 వేల 968 రూపాయలు పెరుగుదల కన్పిస్తుంది.
అటు 18 వేల రూపాయల మూలవేతనమైతే..1080 రూపాయలు ప్రతి నెలా డీఏ పెరుగుతుంది. అంటే నెలకు 6 వేల 120 రూపాయల్నించి 7 వేల 200 రూపాయలు పెరుగుతుంది. 6 శాతం డీఏ పెరగడం వల్ల ఏడాదికి 12 వేల 960 రూపాయలు జీతం పెరుగుతుంది.
Also read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook