Chennupati Gandhi: విజయవాడ పడమటలంకలో దారుణం జరిగింది. వినాయక చవితి ఉత్సవాల వివాదంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిపై దాడి జరిగింది. ఇనుపుచువ్వతో కొందరు దుండగులు విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటు గాంధీపై దాడి చేశారు. ఏకంగా కంట్లో పొడిచేశారు. ఈ ఘటన విజయవాడ 9వ డివిజన్ లో శనివారం సాయంత్రం జరిగింది. రాజకీయ కక్షతో వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని గుర్తించారు. వైసీపీ నేతల దాడిలో ఇనుపచువ్వ నేరుగా కంట్లోకి దిగబడంతో గాంధీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కుడి కన్ను పూర్తిగా పోయింది. ఎడమకన్నుకు ఇన్పెక్షన్ అయినట్లు వైద్యులు గుర్తించారు. విజయవాడలో ట్రీట్ మెంట్ తర్వాత మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు తరలించారు. గాంధీ ఎడమకన్నుకు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
విజయవాడ టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు చెన్నుపాటు గాంధీ. పార్టీ కార్యక్రమాల్లో ఆయనదే కీ రోల్. కార్పొరేటర్ గా గాంధీ నాలుగు సార్లు గెలిచారు. ప్రస్తుతం 9వ డివిజన్ కార్పొరేటర్ గా ఆయన భార్య కాంతి శ్రీ ఉన్నారు. పైపులైను లీకేజీపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో శనివారం ఆయన కార్పొరేషన్ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. ఇంతలోనే కొందరు వైసీపీ నేతలు అక్కడికి వచ్చారు. గాంధీతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ప్రభుత్వంతో టీడీపీ నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ డివిజన్ అధ్యక్షుడు గద్దె కల్యాణ్, వల్లూరి ఈశ్వర ప్రసాద్, సుబ్బు, మరో నలుగురు ఒక్కసారిగా గాంధీపై దాడి చేశారు. తమ ప్రభుత్వం మంజూరు చేసిన పనులు చేయించడానికి నీవెవరు అంటూ దాడికి తెగబడ్డారు.
చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు, రాళ్లతో కొట్టారు. ఇనుప చువ్వతో దాడి చేయడంతో గాంధీ కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. గాంధీని హత్య చేసేందుకు ప్రయత్నించినా స్థానికులు రావడంతో పారిపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కంటికి తీవ్ర గాయమైన చెన్నుపాటి గాంధీని ఆయన అనుచరులు విజయవాడ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు తరలించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, టీడీపీ నేతలు పరుచూరి అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు గాంధీని పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరిలించారు.
టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడితో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు స్పాట్ కు వచ్చి వివరాలు సేకరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటమటలంక ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లతో పహారా ఏర్పాటు చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన చెన్నుపాటి గాంధీ ఫోన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గాంధీపై దాడి చేసిన వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, పడమటలంకలో తెలుగుదేశం నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ రౌడీలు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆయన కంటికి తీవ్ర గాయం అయిందని వారు చెప్పారు.(1/3) pic.twitter.com/vJYDD6lCYO
— N Chandrababu Naidu (@ncbn) September 3, 2022
Read also: Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఖాయమే! ఎమ్మెల్యేలకు కేసీఆర్ సిగ్నల్ ఇచ్చేశారుగా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి