Huge Rush at Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వారాంతపు సెలవులు కావడం, వేసవి సెలవులు కూడా ముగియనుండటంతో చాలా కుటుంబాలు తిరుమల బాట పట్టాయి. దీంతో తిరుమల కొండపై రద్దీ విపరీతంగా ఉంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి సుమారు 30గం. సమయం పడుతోంది. వైకుంఠం, నారాయణగిరి కంపార్ట్‌మెంట్లలో ప్రస్తుతం 3కి.మీ మేర క్యూ లైన్ ఉంది.
క్యూ లైన్లలో వేచియున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రతీ సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను కేటాయించామని...భక్తులకు ఎప్పటికప్పుడు అన్న,పానీయాలు అందజేస్తున్నామని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫారసు లెటర్స్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాలను, వారపు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం అర్దరాత్రి వరకు 67,949 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆదివారం తర్వాత భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మే నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం :
గత మే నెలలో 22 లక్షల పైచిలుకు మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.130 కోట్ల 29 లక్షలు వచ్చింది. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.1కోటి 86 లక్షలు వచ్చాయి.
తిరుమలలో ఈ నెల 12 నుంచి 14 వరకు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. రూ.400 చెల్లించి భక్తులు ఈ సేవా టికెట్లను పొందవచ్చు. రోజుకు 600 చొప్పున టికెట్లను విక్రయిస్తున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read: Minor Gang Rape:బాలికను మొదట టచ్ చేసింది ఎమ్మెల్యే కొడుకే! గ్యాంగ్ రేప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్?
Also Read: Teacher Eligibility Test 2022: ఇవాళ తెలంగాణలో 'టెట్'.. రెండు సెషన్లలో జరగనున్న పరీక్ష..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి