అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని భావిస్తోంది. ఈ దిశగా ఆర్టీసీ యాజమాన్యం అడుగులు వేస్తోంది. నిర్వహణ వ్యయం పెరిగినందున ఛార్జీలు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఛార్జీలు 15 నుంచి 17 శాతం మేర ఛార్జీలు పెంచాలంటూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్లీన్ సిగ్నల్ ఇస్తే జనాలపై ఛార్జీత మోత తప్పదు. అయితే ప్రస్తుతం ఎన్నికోడ్ అమల్లోకి ఉండటం వల్ల ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి వీలులేదని..ఈ క్రమంలో ఛార్జీల పెంపుపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు.అయితే ఇప్పటికిప్పుడు పెంచకపోయిన నప్పటికీ వచ్చే ఏ ప్రభుత్వమైనా ఛార్జీలు పెంచాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు మరికొందరు విశ్లేషకులు.
బాబోయ్ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయట !!