'కరోనా' అపోహతో ఆత్మహత్య

'కరోనా' అపోహ కాటు వేసింది. అవును కేవలం వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయపడి  ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Last Updated : Feb 12, 2020, 02:09 PM IST
'కరోనా' అపోహతో ఆత్మహత్య

'కరోనా' అపోహ కాటు వేసింది. అవును కేవలం వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయపడి  ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

 చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణకు గుండె దడగా ఉండటంతో పరీక్షల కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షల అనంతరం అతనికి వైరల్ ఫీవర్,  జ్వరం, దగ్గు కూడా ఉన్నాయని వెల్లడైంది. ఐతే వైద్యులు రెండు రోజుల పాటు చికిత్స అందించి  ఇంటికి పంపించారు.

ఆదివారం.. అంటే ఫిబ్రవరి 9న సాయంత్రానికి స్వగ్రామానికి  చేరుకున్న బాలకృష్ణ తనకు కరోనా వైరస్ సోకిందని భ్రమపడ్డాడు. అంతే కాదు ఎవరూ తన వద్దకు రావద్దని, ముట్టుకోవద్దని చెప్పి అందరికీ దూరంగా ఉండసాగాడు. తన దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో తరిమి కొట్టి గదిలోకి వెళ్ళి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు..  అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.  

ఆ తరువాత సోమవారం తెల్లవారుజామున బాలకృష్ణ గదిలోంచి.. తాళం తీసుకుని బయటకు వచ్చి తన పొలానికి వెళ్లాడు. అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్నచెట్టుకు ఉరేసుకుని ఆత్య హత్య చేసుకున్నాడు. మృతుడికి గుండె, కాలేయ సమస్యలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే వైరల్ ఫీవర్ రావడంతో కరోనా ఉందనే అపోహతోనే చనిపోయాడని వైద్యులు చెప్పారు. బాలకృష్ణ మృతితో శేషమనాయుడుకండ్రిగ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే రాష్ట్రంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు. 

Trending News