Monsoon Rains: ఓ వైపు చురుగ్గా కదులుతున్న రుతు పవనాలు మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం మారిపోయింది. ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న 3-4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. రానున్న 3-4 రోజుల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు, కోనసీమ, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు.
రేపు శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక ఎల్లుండి అంటే శనివారం నాడు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇప్పటికే నిన్న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. రానున్న రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ క్రమంలో జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చు.
Also read: YS Jagan Loss Factor: వైఎస్ జగన్‌కు తేడా కొట్టింది అక్కడే, ఆ 20 లక్షల ఓట్లే కీలకమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook