Hidden camera in gudlavalleru college incident: ఆంధ్ర ప్రదేశ్ లోని గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమ్మాయిల వాష్ రూమ్ లలో సీక్రెట్ కెమెరాలను గుర్తించారు . దీంతో నిన్న (గురువారం) రాత్రి నుంచి విద్యార్థినులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ ఘటనలో విజయ్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. అతని ఫోన్ లు, ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిడెన్ కెెమెరాతో దాదాపుగా. 300 ల ఫోటోలు, వీడియోలను అతగాడు రికార్డు చేసుకుని, ఇతరులకు అమ్మినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
వారం నుండి చెప్తున్నా యాక్షన్ తీసుకోలేదు.. ఇప్పుడు ఆందోళన చేస్తున్న మా మీద రివర్స్ కేసులు పెడతాం అంటున్నారు https://t.co/i1hiZlIHur pic.twitter.com/FkM3oWGN0p
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024
ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాలని కూడా సీఎం చంద్రబాబు.. మంత్రి కొల్లురవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలు కాలేజీకి చేరుకున్నారు. అంతేకాకుండా..విద్యార్థినులతో మాట్లాడి వారి ఆవేదనను వినే ప్రయత్నం చేశారు. గుడ్ల వల్లేరు కాలేజీ లో ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులు షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనమీద తాము యాజమాన్యానికి వారంరోజుల క్రితమే.. ఫిర్యాదు చేశామని కొంత మంది విద్యార్థినులు చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం అవేమి పట్టించుకోలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కాలేజీ వారు కొంత మంది ఇది ఫెక్ న్యూస్ అంటున్నారని కూడా అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేస్తున్నందుకు తమ మీదే.. రివర్స్ కేసులు పెడుతామంటూ కాలేజీ సిబ్బంది బెదిరిస్తున్నారని కూడా కొంత మంది అమ్మాయిలు మండిపడుతున్నారు. తాము న్యాయం కూడా ప్రశ్నించడం తప్పా.. అంటూ కూడా తమ వాదన విన్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గుడ్ల వల్లేరు ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలంనంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమ్మాయిలకు బైట కాదు కదా.. హస్టల్ లలో కూడా భద్రత కరువైందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను కలిచివేసిందని షర్మిల అన్నారు. చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి ఘటనలు జరగటం ఘోరమన్నారు.. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే.. అక్కడ వారికి సెఫ్టీలేదని కూడా మండిపడ్డారు.
డబ్బుల కోసం కక్కుర్తి పడి.. ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశాయని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై వెంటనే..ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే దీనిపై..ఉన్నతస్థాయి కమిటీ వేయాలని షర్మిల అన్నారు. ఈ ఘటన వెనుకాల ఎవరున్న కూడా.. కఠినంగా శిక్షించాల్సిందేనని షర్మిలా స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.