Srisailam: అటు ఆల్మట్టి.. ఇటు తుంగభద్ర..శ్రీశైలంకు పోటెత్తిన వరద..

Srisailam: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిండటంతో .. నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఒదిలారు. ఇప్పటికే   డెడ్ స్టోరేజికి  చేరుకున్న  శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ కళకళ లాడుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 23, 2024, 10:48 AM IST
Srisailam: అటు ఆల్మట్టి.. ఇటు తుంగభద్ర..శ్రీశైలంకు పోటెత్తిన వరద..

Srisailam: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉత్తరాది సహా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురియడంతో ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షంతో ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నిండటంతో నీటిని దిగువకు విడిచిపెట్టారు. అటు నారాయణ పూర్, తుంగభద్ర జలాశయాలు కూడా వరద నీటితో నిండిపోవడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి 1.90లక్షల క్యూసెక్కులపైగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టుకు జలకళను సంతరించుకుంది.  

కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు 1,69,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా... 37 గేట్లను ఎత్తి ,  జల విద్యుత్‌ ఉత్పత్తి  చేస్తున్నారు. దీంతో మొత్తం 1,74,717క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

మరోవైపు తుంగభద్రకు 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా.. మూడు గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కులను వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.90లక్షల క్యూసెక్కులపైగా వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తంగా కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News