Srisailam: నిండు కుండలా శ్రీశైలం ప్రాజెక్ట్.. ఆల్మట్టి, తుంగభద్ర నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద..

Srisailam Project:  దేశ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుణుడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు.  అంతేకాదు గత కొన్నేళ్లుగా ఒట్టిపోయిన ప్రాజెక్టులు వరదలతో కళకళలాడుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఎగువనున్న ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులు నిండటంతో శ్రీశైలంకు వరద పోటెత్తడటంతో నిండు కుండలా కళకళలాడుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 25, 2024, 02:00 PM IST
Srisailam: నిండు కుండలా శ్రీశైలం ప్రాజెక్ట్.. ఆల్మట్టి, తుంగభద్ర నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద..

Srisailam Project: కృష్ణమ్మ  ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న  భారీ వర్షాలకు  ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టలకు వరద  పోటెత్తడంతో ఆయా ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి వరద నీటిని కిందికి ఒదలుతున్నారు. మొత్తంగా ఆల్మట్టి, నారాయణ పూర్, తుంగభద్ర ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ జలకళతో సంతరించుకుంది.
ఇప్పటికే జూరాల డ్యాంకు గంటగంటకు వరద తీవ్రత పెరుగుతోంది. కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న కారణంగా ఆల్మట్టి డ్యాం నుంచి రెండు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని  ఈ రోజు విడుదల చేశారు.

ఎగువ నుంచి వస్తున్న వరదలకు  అనుగుణంగా తుంగభద్రలోని జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తివేసి రెండు లక్షల పైగా క్యూసెక్కుల నీటిని కిందికి  విడుదల చేశారు. కృష్ణ నది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియా ప్రాంత  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. అంతేకాదు జిల్లా కేంద్రాల్లో వరదకు సంబంధించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసారు.

ఒకవైపు జూరాల నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదతో పాటు..మరోవైపు తుంగభద్ర నుంచి 91 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో వస్తోంది. జూరాల, తుంగభద్ర నుంచి భారీగా వస్తున్న వరదతో శ్రీశైలం డ్యాం వేగంగా నిండుతోంది. వరద తీవ్రత ఇలాగే కొనసాగితే  జూలై చివరి కల్లా శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ శ్రీశైలం డ్యామ్ నిండితే.. వెంటనే అక్కడ విద్యుత్పత్తి ప్రారంభించి దిగువనున్న నాగార్జున సాగర్ కు అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. మొత్తంగా ఈ సీజన్ లో శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ కూడా నిండితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి ఎద్దడి నుంచి బయటపడుతారు. మొత్తంగా కృష్ణమ్మ పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్ లోని  ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి.  సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News