ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ప్లాట్‌ఫారానికి సంబంధించిన మౌళిక వనరుల వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు ఉన్నతమైన, నాణ్యమైన డిజిటల్ సేవలను గూగుల్ ఎక్స్ సంస్థ అందించనుంది.
ఈ రోజే ఈ ఒప్పందంపై రాష్ట్ర సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, గూగుల్ ఎక్స్ యాజమాన్యం సంతకాలు చేశాయి. ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మరియు గూగుల్ ఎక్స్ సీఈఓ ఆస్ట్రో టెల్లర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పురోగతికి మరియు 53 మిలియన్ల ప్రజలకు డిజిటల్ సౌలభ్యాన్ని కలిగించడం కోసం ఈ ఒప్పందాన్ని చేసుకున్నట్లు ఐటి శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా గూగుల్ ఎక్స్‌కు సంబంధించిన డెవలప్‌మెంట్ సెంటర్‌ను విశాఖపట్నంలో నెలకొల్పనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ రోజే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలోని గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని నారా లోకేష్ సందర్శించారు.
త్వరలో విశాఖకి రానున్న గూగుల్ ఎక్స్..!