Godavari Flood: ధవిళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

గోదావరి ( Godavari ) నదీ పరివాహక ( River catchment area )ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రాజమండ్రి ( Rajahmundry ) ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ విడుదల చేసారు. నదీ ప్రవాహం మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Last Updated : Aug 15, 2020, 05:33 PM IST
Godavari Flood: ధవిళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

గోదావరి ( Godavari ) నదీ పరివాహక ( River catchment area )ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రాజమండ్రి ( Rajahmundry ) ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ విడుదల చేసారు. నదీ ప్రవాహం మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్ర ( Maharashtra ) , ఉపనదుల ( Sub Rivers of Godavari ) పరివాహక ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు నమోదవతున్నాయి. దాంతో గోదావరి నదిలోకి వరద నీరు ( Godavari Flood ) పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. ధవిళేశ్వరం బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ( First Warning level ) ను జారీ చేశారు. అటు బ్యారేజ్ గేట్లను ఎత్తి..పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు. ఇది కాకుండా తూర్పు డెల్టాకు 2 వేల 5 వందల క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 3 వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల 250 క్యూసెక్కుల నీటిని వ్యవసాయం కోసం వదులుతున్నారు. గోదావరి నది ప్రధాన పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రలోనూ, గోదావరి ఉపనదులైన ప్రాణహిత ( Pranahitha ), పెన్ గంగ ( Pen ganga ) పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ( Heavy rains ) వరద నీరు పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు మరింత పెరిగే అవకాశముందని అధికార్లు అంచనా వేస్తున్నారు. Also read: Ram Tweet on Jagan: కుట్ర జరుగుతోందంటూ హీరో ట్వీట్ కు కారణమదేనా

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x