Guntur Politics: వైసీపీలో వరుస అవమానాలు.. మాజీమంత్రి నారజ్‌!

Mekathoti sucharita: వైసీపీలో ఆ సీనియర్ నేత కేరీర్‌ ముగిసిపోయిందా.! ఆ నేత రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచే ఆమె ఇంకా కోలుకోలేకపోతున్నారా..!అందుకే రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారా..! ఇంతకీ ఎవరా నేత.. ఎందుకు రాజకీయాలకు ఎందుకు దూరమవుతున్నారు..!

Written by - G Shekhar | Last Updated : Dec 7, 2024, 09:00 PM IST
Guntur Politics: వైసీపీలో వరుస అవమానాలు.. మాజీమంత్రి నారజ్‌!

Mekathoti sucharita: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి దాదాపు 6 ఆర్నెళ్లు దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్‌ దెబ్బకు వైసీపీలో హేమీహేమీలు ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీమంత్రి మేకతోటి సుచరిత కూడా ఒకరు.. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత.. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత సుచరిత రాజకీయ సన్యాసం తీసుకున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ సుచిరిత వైసీపీ దూరం కావడం వెనుక మాత్రం కారణాలు మరోలా ఉన్నాయని టాక్ సైతం వినిపిస్తోంది..

ఇక మేకతోటి సుచరిత రాజకీయ ఆరంగేట్రం జడ్పీటీసీ నుంచి మొదలైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి తొలిసారి గెలిచిన సుచరిత.. ఆ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రొత్సోహాంతో సుచరిత తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడంతో సుచరిత వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన సుచరిత.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి రావేల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అంతేకాదు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో సీఎం జగన్‌ హోంమంత్రి పదవిని కట్టబెట్టడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. రాష్ట్రంలో చాలామంది వైసీపీ లీడర్లు ఉన్నప్పటికీ సుచరితకే మంత్రి పదవిని కట్టబెట్టడం ఏంటని నేతలు చెవులు కొరుక్కున్నారు.. కానీ రెండున్నరేళ్లు పూర్తి కాగానే సీఎం జగన్‌ సుచరితకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఆమెతో పాటు చాలామంది మంత్రులను తన మంత్రివర్గం నుంచి భర్తరప్‌ చేసి కొత్తవారికి అవకాశం కల్పించారు. అయితే జగన్‌ చర్యతో షాక్ తిన్న మేకతోటి సుచరిత.. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడం అప్పట్లో హాట్‌ టాపిక్ అయ్యింది.

అయితే కొద్దిరోజుల తర్వాత తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. కానీ తన అసంతృప్తిని మాత్రమే వెళ్లగక్కుతూనే వచ్చారు. కానీ మాజీ  హోంమంత్రి సుచరిత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌కు బాపట్ల ఎంపీ సీటును ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వైసీపీ అధినేత జగన్‌  దయాసాగర్‌ కు టికెట్‌ ఇవ్వలేదు.. అంతేకాదు.. సుచరితను ప్రత్తిపాడు నుంచి తప్పించి.. తాడికొండ నుంచి పోటీ చేయించారు. దాంతో తాడికొండలో సుచరిత ఘోర ఓటమి పాలయ్యారు. తనను సొంత నియోజకవర్గంలో పోటీకి దింపకుండా తాడికొండ నుంచి పోటీ చేయించడం ఏంటని ఆమె అప్పట్లో బహిరంగంగానే విమర్శలు గుప్పించినట్టు సమాచారం.. తాజాగా తాడికొండ నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇంచార్జ్‌ను నియమించింది. అక్కడ డైమండ్‌ బాబుకు ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ చర్యతో మేకతోటి సుచరిత పూర్తిగా అలక బూనినట్టు తెలుస్తోంది.

మొత్తంగా జగన్ తీరుతో మేకతోటి సుచరిత మాత్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పదేపదే సొంత పార్టీ నుంచి అవమానాలు ఎదుర్కొవడం ఎందుకని ఆమె డిసైడ్‌ అయ్యారట. ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారట.. అయితే వైసీపీని వీడాక... ఏ పార్టీలో చేరుతారు.. టీడీపీలోకి వెళ్తారా..లేదంటే జనసేన కండువా కప్పుకుంటారా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే..!

Also Read: BJP Telangana: మంత్రి ఉత్తమ్‌ దెబ్బకు.. బీఆర్‌ఎస్‌ కుదేలు..!

Also Read: Rain Alert: మరో అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు వర్షసూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News