వాయివేగంతో దుసుకొస్తున్న ‘తితలీ’ తుఫాను ; కోస్తా జిల్లాలు అప్రమత్తం

               

Last Updated : Oct 10, 2018, 05:06 PM IST
వాయివేగంతో దుసుకొస్తున్న ‘తితలీ’ తుఫాను ;  కోస్తా జిల్లాలు అప్రమత్తం

విశాఖపట్న: వాయువేగంతో దూసుకువస్తున్న ‘తితలీ’ తుఫాను ప్రస్తుతం కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 480కి.మీ. దూరంలో  కేంద్రీకృతమై .. గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 530కి.మీ. దూరంలో ఉంది. ఉత్తరకోస్తా జిల్లాలను వణికించడానికి  ఇచ్ఛాపురం, గోపాల్‌పూర్‌ దిశగా దూసుకొస్తోంది. కాగా గురువారం ఉదయం కళింగపట్నం, గోపాలపూర్‌ మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

తుఫాను తీరాం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు 100 కి.మీ.వేగంతో గాలులు ఈడ్చి కొడతాయని...  భారీ ఎత్తున సముద్ర అలలు ఎగసిపడతాయి హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా వాయుగుండం ప్రభావం వల్ల ప్రస్తుతం గాలులు ఈశాన్య దిశ నుంచి వీస్తున్నాయి. 

శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖ, విజయనగరం జిల్లాలపై తుపాను ప్రభావం చూపే అవకాశమున్నందున స్థానికంగా ఉండే జనాలు వణికిపోతున్నారు. కాగా తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు మందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత వాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 

Trending News