అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్(కోవిడ్-19) పరీక్షలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా డాక్టర్లు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని, దక్షిణ కొరియా నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రత్యేక చార్టర్ విమానంలో నేడు తీసుకొచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం తేలనుందని, కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగించనున్నట్లు తెలిపారు.
Read Also: ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహామ్మారిని నిర్మూలించేంతవరకు వరకు 24/7 పని చేయాల్సిందేనని సీఎం జగన్ సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. ఇప్పటికే దక్షిణ కొరియా సియోల్ నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లు రావడంతో వైరస్ నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నాయని, రోజుకు చేసే టెస్టుల సంఖ్య 10వేల వరకు పెరుగుతుందని సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం.