Ys Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయకుండానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు బాహాటంంగా మద్దతిచ్చి..ఆ తరువాత పార్టీని విలీనం చేసి కండువా కప్పుకున్న వైఎస్ షర్మిలకు అసలు రాజకీయమంటే ఎంటో రుచి చూపిస్తోంది ఆ పార్టీ. అసలేం జరిగిందంటే..
వాస్తవానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిద్దమనుకున్న వైఎస్ షర్మిలకు ఆక్కడి సీనియర్లు మోకాలడ్డారు. రేవంత్ రెడ్డి సహా అందరూ ఆమెను వ్యతిరేకించడంతో తెలంగాణ ఎన్నికలకు ముందే జరగాల్సిన పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోయింది. అయినా ఆమెకు కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు అర్ధం కాలేదు. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకు బాహాటంగా మద్దతు తెలిపింది. ఇక ఆ తరువాత ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయనగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆమెతో సంప్రదింపులు జరిపింది. ఏపీలో కనీసం ఉనికి కాపాడుకునేందుకు ఆమె అవసరం ఏర్పడినట్టుంది. హుటాహుటిన పిలిపించుకుని హామీలిచ్చి..పార్టీ కండువా కప్పుకునేలా చేసింది.
ఇది జరిగి వారం రోజులౌతున్నా ఇంకా వైఎస్ షర్మిలకు ఎలాంటి పదవి ఇచ్చిన పాపాన పోలేదు. ఏ బాధ్యతలు అప్పగించలేదు. పీసీసీ ఛీఫ్ పదవి ఇస్తారని అంతా ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా ఆమెకు ఏ హామీ ఇచ్చిందో తెలియకపోయినా కీలక బాధ్యతలు ఇస్తాననే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఏ బాధ్యతలు అప్పగించలేదు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఆమె రాకను ఏ విధంగా అక్కడి సీనియర్లు అడ్డుకున్నారో అదే ఏపీలోనూ పునరావృతమౌతోంది. తాజాగా మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హర్షకుమార్ మీడియా సమావేశంలో ఆమెకు నో చెప్పారు. ఆమెకు పీసీసీ పదవి ఇస్తే అంతా బూడిదలో పోసిన పన్నీరేనని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇద్దరూ ఒక్కటేనని, తాము సురక్షితంగా ఉండేందుకు చెరో పార్టీ ఎంచుకున్నారంటూ బాహాటంగా విమర్శలకు దిగారు హర్షకుమార్. వైఎస్ షర్మిలకు పీసీసీ ఛీఫ్ పదవి ఇవ్వద్దంటూ అధిష్టానాన్ని సూచించారు. కాంగ్రెస్ పార్టీకు చెందిన మరో సీనియర్ నేత తులసి రెడ్డి సైతం షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి అటు తెలంగాణ, ఇటు ఏపీ రెండు చోట్లా కాంగ్రెస్ సీనియర్లు ఆమె రాకను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. తెలంగాణలో అయితే ఆమె అప్పటికి పార్టీలో చేరలేదు. ఇక్కడ మాత్రం పూర్తిగా పార్టీ కండువా కప్పుకున్న తరువాత వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
Also read: EPFO Nominee Rules: పీఎఫ్ నామినీగా కొడుకు, కుమార్తెను చేర్చవచ్చా, ఎవరికి అవకాశం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook