/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Ramya Murder Case Verdict: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రేమ పేరుతో వెంటపడి.. నడి రోడ్డుపై రమ్యను నరికేసిన నిందితుడు శశికృష్ణను హంతకుడిగా పరిగణిస్తూ ఉరిశిక్ష విధించింది. అతడు చనిపోయేంత వరకు ఉరితీయాల్సిందిగా తీర్పు ఇచ్చింది. ఈ కేసును అరుదైన కేసుల్లో అరుదైనదిగా పరిగణించాల్సి అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. హత్య చేసిన నిందితుడిలో ఎలాంటి మార్పు కనిపించలేదనీ, తప్పు చేశానన్న పశ్చాత్తాపం వ్యక్తం కాలేదని వ్యాఖ్యానించింది.

గత ఏడాది ఆగస్టు 15న  టిఫిన్ తెచ్చేందుకు ఇంటి నుంచి బయటకొచ్చిన రమ్యను వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన శశికృష్ణ కత్తితో ఎనిమిదిసార్లు దారుణంగా పొడిచి హతమార్చాడు. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ప్రేమిస్తున్నానంటూ శశికృష్ణ.. రమ్యను వేధించాడు. తన మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసిందన్న కోపంతో కక్ష పెంచుకుని హత్య చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

36 మందిని విచారించిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 28 మంది సాక్షుల నుంచి కోర్టు వాంగ్మూలం సేకరించింది. 9 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి.. తుది తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 302 కింద ఉరిశిక్షను ఖరారు చేసింది.

 కోర్టు తీర్పు పట్ల రమ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉన్మాదులకు ఉరే సరైన శిక్ష అని అభిప్రాయపడ్డారు. న్యాయం జరిగేలా చూశారంటూ ప్రభుత్వానికీ, పోలీసులకూ కృతజ్ఞతలు తెలిపారు.  మరోవైపు తన కుమారుడికి ఉరిశిక్ష పడటంపై అతడి తల్లి భూలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తమకు తినడానికి తిండి కూడా లేదన్నారు.

రమ్యని అంతమొందించిన మానవ మృగం శశికృష్ణకి కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నానన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. రమ్య హంతకుడిని శిక్షించాలని తాను ఆందోళనకి దిగితే...తమపై దాడులు చేసి రివర్స్ కేసులు బనాయించారన్నారు. వైసీపీ అండతో చట్టాన్ని చుట్టంగా చేసుకుని చెలరేగిపోతున్న నేరగాళ్లకి న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు అని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ రెడ్డి హయాంలో ఆడపిల్లలపై జరిగిన 800 హత్య, అత్యాచారాల కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వరమే న్యాయం జరగాలని కోరుకుంటున్నానన్నారు.

Also Read: Bjp Slogans at Minster Prasanth Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుట జైశ్రీరాం నినాదాలు

Also Read: Ktr Hot Comments: తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ.. కేటీఆర్ కు బొత్స కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Btech Student Ramya Murder case Verdict By Fast Track Court in AP
News Source: 
Home Title: 

Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!

Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!
Caption: 
Ramya Murder Case Verdict (Photo File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

నిందితుడికి ఉరి శిక్ష విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు

రమ్యను కత్తితో పొడిచి చంపిన నిందితుడు

Mobile Title: 
బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, April 29, 2022 - 16:41
Request Count: 
101
Is Breaking News: 
No