AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. విచారణ తొలిరోజే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఆ ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఏపీ మూడు రాజధానుల (Ap Three Capitals Issue)అంశంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రోజువారీ కేసు విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభంలోనే కీలక పరిణామం జరిగింది. త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు కేసు విచారణ నుంచి తప్పుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును(Ap High Court)అభ్యర్ధించింది. రాజధాని ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఈ ఇద్దరు న్యాయమూర్తులకు 6 వందల గజాల స్థలాన్ని గజానికి 5 వేల రూపాయల చొప్పున కేటాయించింది. ఆ స్థలాన్ని సదరు న్యాయమూర్తులు తీసుకున్నందున మూడు రాజధానుల అంశంపై విచారణ జరపడం సబబు కాదనేది ప్రభుత్వ వాదన.
ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే(Dushyant Dawe) ప్రభుత్వం తరపున వాదన విన్పించారు. స్థలాల కొనుగోలుతో పెట్టుబడి సంబంధిత ఆర్ధిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే అభ్యర్ధించారు. న్యాయమనేది జరగడమే కాదు జరిగినట్టు కన్పించాలని చెప్పారు. అయితే ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ నుంచి తప్పుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తాను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా అని ప్రశ్నించారు. అలా అయితే ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్క జడ్జిని కేసు నుంచి తప్పుకోవాలని కోరతారన్నారు. కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న తమ పిటీషన్‌పై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని కోరారు. తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చినా అభ్యంతరం లేదని..అయితే లిఖితపూర్వకంగా ఇవ్వాలన్నారు. దీనికి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యతిరేకించారు. తుది తీర్పు ఇచ్చే సమయంలో ఆ ఉత్తర్వులు ఇస్తామని..ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు. అప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని దుష్యంత్ దవే స్పష్టం చేశారు.
కీలకమైన ఈ పరిణామంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో ఏడాది కాలంగా అభివృద్ధి నిలిచిపోయిందనేది జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అభిప్రాయంగా ఉంది. అందుకే రోజువారీ విచారణ జరుగుతుందన్నారు. మరోవైపు విచారిస్తున్న కేసు నుంచి సదరు న్యాయమూర్తులు స్వచ్ఛంధంగా తప్పుకోవాలని దుష్యంత్ దవే కోరారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పును(Supreme Court)ఉదహరించారు. కేసు నుంచి ఆ ఇద్దరు న్యాయమూర్తులు తప్పుకుంటారా లేదా అనేది చూడాలి.
Also read: Amit shah: ఏపీలో అధికారం దిశగా టార్గెట్ 2024 , నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook