అలర్ట్: ఏపీ టెట్ దరఖాస్తుకు ముగుస్తున్న గడువు

మే 5వ తేదీ నుంచి ఏపీ టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఈ నెల 22వ తేదీతో ఫీజు చెల్లింపునకు సమయం ముగుస్తుంది.

Last Updated : May 20, 2018, 04:31 PM IST
అలర్ట్: ఏపీ టెట్ దరఖాస్తుకు ముగుస్తున్న గడువు

మే 5వ తేదీ నుంచి ఏపీ టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఈ నెల 22వ తేదీతో ఫీజు చెల్లింపునకు సమయం ముగుస్తుంది. మే 23వ తేదీ దరఖాస్తు పంపే గడువు కూడా ముగియనుండగా.. కఆప్లై చేసేవారు చివరి తేదీ వరకూ వేచి చూడకపోవడం మంచిది. ఈనెల 25న మాక్‌టెస్టులు అందుబాటులో ఉంటాయన్న అధికారులు.. జూన్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, జూన్ 10 నుంచి పరీక్షలు జరుగుతాయన్నారు.

ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున విడివిడిగా పరీక్ష ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తును పూర్తి చేసి, ఆన్‌లైన్‌లో సమర్పిస్తే ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తులో తప్పుగా నమోదు చేస్తే మరోసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇందుకోసం అదనంగా మరో రూ.500 చెల్లించాలి. కనుక దరఖాస్తు చేసుకోనేటప్పుడే జాగ్రత్తగా వివరాలను నమోదు చేయండి.

నోటిఫికేషన్ ప్రకారం టెట్‌లో ఈసారి కొత్తగా వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్‌-2(బి) ప్రవేశపెట్టారు. గతంలో టెట్‌ను మూడుపేపర్లుగా నిర్వహించగా ఈసారి రెండు పేపర్లకే పరిమితం చేశారు. కానీ, పేపర్‌-2ను ఏ, బీగా విభజించారు. పేపర్‌-1ను ఎస్జీటీలకు, పేపర్‌-2(ఎ)ను గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, భాషా పండితులకు, పేపర్‌-2(బి)ని వ్యాయామ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తారు.

ఏపీటెట్ - 2018 షెడ్యూల్‌...

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ: మే 5 నుంచి 23 వరకు.
  • ఫీజు చెల్లింపు ప్రక్రియ: మే 5 నుంచి 22 వరకు.
  • టెట్ మాక్‌టెస్ట్‌: మే 25 నుంచి.
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జూన్‌ 3 నుంచి.
  • టెట్ పేపర్‌ - 1 పరీక్ష తేది: జూన్‌ 10 - 12వరకు.
  • టెట్ పేపర్‌ - 2 (ఎ): జూన్ 13 - 15 వరకు, జూన్ 17 - 19 వరకు.
  • టెట్ (వ్యాయామ ఉపాధ్యాయులు) పేపర్‌ - 2 (బి): జూన్ 21న.
  • ప్రాథమిక ‘కీ’ విడుదల: జూన్ 22న
  • అభ్యంతరాల స్వీకరణ: జూన్ 26 వరకు.
  • తుది‘కీ’ విడుదల: జూన్ 28న.
  • టెట్ ఫలితాలు: జూన్ 30న.

టెట్‌కు దరఖాస్తు చేసేవారికి సూచనలు:

  • అన్ని సర్టిఫికేట్లు, వివరాలు, తాజా ఫోటో సిద్దం చేసుకోండి.
  • బాగా అనుభవం ఉన్న నెట్ సెంటర్ వారి వద్దే అప్లై చేయండి.
  • పేమెంట్ కోసం net banking లేదా atm card ఉంటే మీ సేవ వెళ్లే అవసరం ఉండదు.
  • మొబైల్ ఉండాలి.
  • పేమెంట్ తర్వాత journal number వస్తుంది. దాన్ని ప్రింట్ తీయండి లేదా రాసుకోండి.
  • అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చూసుకుని submit చేయండి.
  • సహాయం కొసం website- http://aptet.apcfss.in/లోని నెంబర్లను సంప్రదించండి.

Trending News