YS Jagan: రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలి: వైఎస్ జగన్

అన్నదాతల ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. జనతా బజార్లలో కేవలం రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలంటూ అధికార్లను ఆదేశించారు. తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

Last Updated : Jul 1, 2020, 09:27 PM IST
YS Jagan: రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలి: వైఎస్ జగన్

అన్నదాతల ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. జనతా బజార్లలో కేవలం రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలంటూ అధికార్లను ఆదేశించారు. తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జనతా బజార్లు, ఈ మార్కెటింగ్ సేవలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులకు, ప్రజలకు మద్య దళారీ వ్యవస్థ లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా జనతా బజార్లలో రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని వైఎస్ జగన్ అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల్ని ఆదుకోవడం, వినియోగదార్లకు ప్రయోజనం చేకూర్చడమే జనతా బజార్ల ఉద్దేశ్యమని స్పష్టం చేశారు జగన్. సమీక్షలో జగన్ తో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి కన్నబాబు, వ్యవసాయ శాఖ ఛీప్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఇతర అధికార్లు పాల్గొన్నారు. జనతా బజార్లలో పాలు, రొయ్యలు, చేపలు వంటి ఆక్వా ఉత్పత్తుల్ని కూడా అందుబాటులో తీసుకురావాలని సీఎం సూచించారు. Also read: New Era in AP: ఏపీలో రేపటి నుంచి ఆధునిక అంబులెన్స్ లు ప్రారంభం

జనతా బజార్లు, ఆర్బీకేలకు అవసరమైన ఈ ప్లాట్ ఫాం కోసం మౌళిక సదుపాయాల్ని తక్షణం ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ముగిసేనాటికి పంటలకు కల్పించాల్సిన కనీస గిట్టుబాటు ధరలపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. Also read: AP High Court: ఏపీ హైకోర్టు కార్యకలాపాలు రద్దు

Trending News